FSSAIలో ఉద్యోగాలు: 254 పోస్టులు-మంచి జీతం-అర్హతలు ఇవే..!!
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రూప్ ఏలో 21 పోస్టులు, గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ కేడర్‌లో 233 పోస్టులు భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 7 నవంబర్ 2021.
ఇక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నికల్ ఆఫీసర్ అసిస్టెంట్‌తో పాటు ఇతర పోస్టులను సైతం భర్తీ చేయనున్నారు. వివిధ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చూడగలరు. ఈ పోస్టులన్నీ శాశ్వత ప్రాతిపదికనే భర్తీ చేయడం జరుగుతుందని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది.

సంస్థ పేరు: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నికల్ ఆఫీసర్ అసిస్టెంట్‌తో పాటు ఇతర పోస్టులు
పోస్టుల సంఖ్య: 254
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 7 నవంబర్ 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఆయా బ్రాంచిలో డిగ్రీతో పాటు కొన్ని పోస్టులకు పని అనుభవం తప్పనిసరి. ఇక పూర్తి విద్యార్హతలు ఏ పోస్టుకు ఎంత పని అనుభవం ఉండాలి అన్న అంశాలను వివరంగా తెలుసుకునేందుకు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడాల్సి ఉంటుంది.
వయస్సు: 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు. ప్రభుత్వం సూచించిన ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్టు
వేతనం:
గ్రూప్ ఏ పోస్టులకు: నెలకు రూ. 56,100/-నుంచి రూ. 1,77,500/-
గ్రూప్ బీ పోస్టులకు: నెలకు రూ. 44,900/- నుంచి రూ. 1,42,400/-
గ్రూప్ సీ పోస్టులకు : నెలకు రూ. 35,400/- నుంచి రూ. 1,12,400/-
అప్లికేషన్ ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.1500
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.500/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తులు స్వీకరణ ప్రారంభ తేదీ: 8 అక్టోబర్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 7 నవంబర్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: www.fssai.gov.in












Click it and Unblock the Notifications