గేట్ -2025 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..!
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్)-2025 ఫలితాల విడుదలకు సమయం ఆసన్నమైంది. గేట్- 2025 ఫలితాలు ఇవాళ సాయంత్రం 4 గంటలకు రిలీజ్ కానున్నాయి. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్ లో అభ్యర్థుల ర్యాంకులు, మార్కుల వివరాలను పొందుపరచనున్నారు. ఇక ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐటీ రూర్కీ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఐఐటీ రూర్కీనే అభ్యర్థుల స్కోర్ విడుదల చేయనుంది. ఇక ఇప్పటికే ప్రిలిమినరీ ఆన్సర్ కీ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.
అధికారిక వెబ్ సైట్ లో..
పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://gate2025.iitr.ac.in/ లేదా https://goaps.iitr.ac.in/login ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంటెక్.. కొన్ని విద్యాసంస్థల్లో నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువులకు అర్హత పొందేందుకు ఈ పరీక్షలను ఐఐఎస్‌సీ బెంగళూరు, పాత ఐఐటీలు కలిసి ఏటా నిర్వహిస్తున్నాయి.

ఈ ఏడాది ఐఐటీ రూర్కీ ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 27న ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించింది. ఇక మొత్తం 30 సబ్జెక్టులకు గేట్ జరుపుతున్నారు. సుమారు 80 శాతం మంది పరీక్షకు హాజరై ఉంటారని అంచనా. గత ఏడాది 8.26 లక్షల మంది దరఖాస్తు చేసి.. 6.53 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో 1.29 లక్షల మంది అర్హత సాధించారు.
ఇలా చెక్ చేసుకోవాలి..
మొదట GOAPS పోర్టల్ https://goaps.iitr.ac.in/login వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఎన్‌రోల్‌మెంట్ ID లేదా ఈమెయిల్ ఐడీతో లాగిన్ అవ్వండి. 'GATE 2025 Result' ట్యాబ్‌పై క్లిక్ చేయండి. GATE Result స్క్రీన్‌పై కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications