నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. SBI లో 18 వేల ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలి?
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన SBI లో భారీ నోటిఫికేషన్ వెలువడనుంది. ఏకంగా 18 వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్థమైంది. ఎస్బీఐలో ఈ దశాబ్దంలోనే అతిపెద్ద నోటిఫికేషన్ గా భావించవచ్చు. తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 18 వేల పోస్టులతో అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
SBI రిక్రూట్ మెంట్ లో భాగంగా ప్రొబేషనరీ ఆఫీసర్లు, లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల పోస్టులు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మరో 3 వేల మంది ఆఫీసర్లను ప్రత్యేకంగా తీసుకోనున్నట్లు సమాచారం. ఇక గత పదేళ్లలో ఎస్బీఐ నుంచి ఇదే అతిపెద్ద నోటిఫికేషన్ కానుంది. ఇక బ్యాంకు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఇదో మంచి అవకాశంగా భావించవచ్చు.
ఎస్బీఐ చేపట్టనున్న ఈ నియామకంలో 13, 500 నుంచి 14 వేల వరకు క్లరికల్ స్టాఫ్, 3 వేల మంది ప్రొబేషనరీ ఆఫీసర్లు, 1600 మంది సిస్టమ్ ఆఫీసర్లను రిక్రూట్ చేయనున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. డిజిటల్, ఐటీ స్కిల్స్ టీమ్ ను కూడా సెట్ చేయనున్నట్లు శెట్టి వెల్లడించారు. ఇది బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద నోటిఫికేషన్ కానుందని శెట్టి స్పష్టం చేశారు.

అయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు, అర్హత, అప్లికేషన్ విధానంకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఛైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగులకు ఈ రిక్రూట్ మెంట్ ఓ వరంగా భావించవచ్చు.












Click it and Unblock the Notifications