తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 2,050 నర్సింగ్ ఆఫీసర్ కొలువులకు నోటిఫికేషన్...
తెలంగాణలోని నిరుద్యోగులకు రేవంత్ సర్కారు మరో శుభవార్తను అందించింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య సేవల నియామక బోర్డు బుధవారం ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలనుకునేవారు సెప్టెంబర్ 28వ తేది నుంచి అక్టోబరు 14వ తేది వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ పేర్కొంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://mhsrb. telangana.gov.in ను సంప్రదించగలరు.
నోటిఫికేషన్ పొందుపరిచిన వివరాల మేరకు.. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ/వైద్యవిద్య డైరెక్టరేట్ పరిధిలో 1576 స్టాఫ్‌నర్సు పోస్టులు ఉండగా, తెలంగాణ వైద్య విధానపరిషత్ పరిధిలో 332 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80 పోస్టులు,, ఆయుష్‌లో 61, ఐపీఎంలో ఒక స్టాఫ్‌నర్సుతో కలిపి మొత్తం 2050 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక, ఈ పోస్టులకు నవంబరు 17వ తేదిన సిబిటి విధానంలో పరీక్ష జరగనుంది. ఇందులో రాతపరీక్షకు 80 పాయింట్లు ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఇవ్వనున్నారు. హైదరాబాద్‌తో సహా మొత్తం13 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. దరఖాస్తులను ఈ నెల 28వ తేది నుంచి అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ అప్లికేషన్లను అక్టోబర్ 16వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు సవరించుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తారు.

విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునేవారు జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ లేదా బీఎస్సీ (నర్సింగ్) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు : ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలనుకునేవారి కనిష్ఠ వయోపరిమితి 18 ఏళ్లు కాగా, గరిష్ఠ వయోపరిమితి 46 ఏళ్లకు పెంచారు.
జోన్ల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులివే..
జోన్1- 241 పోస్టులు,
జోన్2- 86 పోస్టులు,
జోన్3- 246 పోస్టులు,
జోన్4- 353 పోస్టులు,
జోన్5- 187 పోస్టులు,
జోన్6- 747 పోస్టులు,
జోన్7-114 పోస్టులు,












Click it and Unblock the Notifications