నిరుద్యోగులకు శుభవార్త... ఏపీఎస్సీఎస్సీఎల్‌లో ఉద్యోగాల భర్తీ...
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీఎస్సీఎస్సీఎల్‌లో పలు జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, రాజమండ్రిలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం...
రాజమండ్రిలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
తూర్పుగోదావరి జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలంటే ఆఫ్‌లైన్‌లో చేసుకోవాలి. రాజమండ్రిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్. జిల్లా కార్యాలయానికి దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 5 చివరి తేదిగా పరిగణించడమైంది.

పోస్టులు, అర్హతల వివరాలు ఇలా ఉన్నాయి...
టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3: 12 పోస్టులు
విద్యార్హత : బీఎస్సీ (అగ్రికల్చర్/ హార్టికల్చర్ / బయోటెక్నాలజీ/ డ్రైల్యాండ్ అగ్రికల్చర్/ బాటనీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు : 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేయు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆఫీస్, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా చిరునామాకు పంపాల్సి ఉంటుంది. డిసెంబర్ 5.2023 లోపు ఈ దరఖాస్తు ఫారాలను పంపాలి. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/ ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
నెల్లూరులోని అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు..
నెల్లూరులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిబ్బంది నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
అకౌంటెంట్ గ్రేడ్-III: 02 పోస్టులు
డేటా ఎంట్రీ ఆపరేటర్: 02 పోస్టులు
విద్యార్హత, వయసు అర్హతలు...
విద్యార్హత : డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంకాం ఉత్తీర్ణత కూడా పొంది ఉండాలి.
వయసు : 35 సంవత్సరాలు మించకూడదు.
శాలరీ : అకౌంటెంట్‌కు నెలకు రూ.27,000. డేటా ఎంట్రీ ఆఫరేటర్‌కు రూ.18,500 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, ఏపీఎస్సీఎస్సీఎల్, వేదాయపాలెం, నెల్లూరు చిరునామాకు పంపాల్సి ఉంటుంది. నవంబర్ 30, 2023 వ తేది లోగా దరఖాస్తులు పంపాలి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఈ వైబ్‌సైట్‌ను https://spsnellore.ap.gov.in/notice_category/recruitment/ సందర్శించగలరు. అసక్తి గల అభ్యర్థులు త్వరపడండి..












Click it and Unblock the Notifications