తెలంగాణ రోడ్లు భవనాల శాఖలో 472 పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖలో కొత్తగా 472 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులన్నీ ఆ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ పరిధిలో భర్తీ చేయనున్నారు.
దీంతోపాటు బీసీ సంక్షేమశాఖ పరిధిలోని 2,591 గురుకుల పోస్టుల భర్తీకి అనుమతి ప్రక్రియ ఆర్థికశాఖలో దాదాపు పూర్తయింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆమోదిస్తే పోస్టులకు జనవరి 7న ప్రకటన వెలువరించాలని ఆర్థికశాఖ నిర్ణయించింది.

ఇప్పటికే వరుసగా పలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. పురపాలక శాఖలో 78 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, ఒక అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. వీటికి జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
విద్యాశాఖలో 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి కూడా నేడు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ కమిషనరేట్‌లో 40 లైబ్రేరియన్ పోస్టులు, సాంకేతిక విద్యాశాఖలో 31 లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్ పీఎస్సీ వెల్లడించింది.
కళాశాల విద్యాశాఖలో 544 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లు పోస్టులను భర్తీ చేయనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే లేదా జూన్ నెలలో నియామక పరీక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ సంప్రదించవచ్చు.
మరోవైపు, 113 అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్ స్పెక్టర్(ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. మే లేదా జూన్ నెలలో నియామక పరీక్ష ఉంటుందని టీఎస్‌పీఎస్సీ తేలింది.
తెలంగాణ గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల: 1365 పోస్టులు
1365 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గత శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.












Click it and Unblock the Notifications