ALERT: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి హరియాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్(HPSC) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2,424 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మార్చి 1, 2025 నుండి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. దరఖాస్తుకు చివరి తేదీ 15 మార్చి 2025గా నిర్ణయించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ hpsc.gov.in ని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు:
2,424 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
వయోపరిమితి:
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు ఉండాలి.అయితే రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
నియామకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాలి. రాష్ట్రం వెలుపలి నుండి వచ్చే జనరల్ కేటగిరీ, పురుష అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.1000గా నిర్ణయించారు. అదే సమయంలో రాష్ట్ర రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు, అన్ని మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 250గా నిర్ణయించారు. దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుండి మినహాయింపు ఉంది.
అర్హతలు
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్థి మెట్రిక్యులేషన్ స్థాయిలో హిందీ లేదా సంస్కృతం సబ్జెక్టును చదివి ఉండాలి. అభ్యర్థి UGC NET, SLET లేదా SET పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.












Click it and Unblock the Notifications