JEE main 2025: జేఈఈ మెయిన్ పరీక్షా పత్రం ఎలా ఉంది ? నిపుణుల విశ్లేషణ ఇదే..!
జాతీయ స్దాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ సెషన్ 1 పరీక్షలు ఇవాళ మొదలయ్యాయి. బీఈ, బీటెక్ ప్రవేశాల కోసం తొలిరోజు ఉదయం సెషన్ లో జరిగిన పేపర్ 1 పరీక్షపై నిపుణులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఉదయం షిఫ్ట్ లో పేపర్ 1ను రెండు షిఫ్ట్ లలో నిర్వహించారు. తొలి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ నిర్వహించారు.
ఇందులో సెషన్ 1 తొలి రోజు పరీక్ష పత్రం సులువు నుంచి మధ్యమంగా ఉందని నిపుణలు అంచనా వేస్తున్నారు. సెషన్ ఫలితాల ప్రకటన తర్వాత జేఈఈ మెయిన్ కటాఫ్ ను ఎన్టీఏ ప్రకటిస్తుంది. అనంతరం జేఈఈ మెయిన్ 2025లో అర్హత సాధించిన అభ్యర్ధులకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఆ తర్వాత కాలేజీల్లో ప్రవేశాలు ప్రారంభమవుతాయి. ఇవాళ జరిగిన సెషన్ 1 పరీక్షలో ప్రశ్నాపత్రాలపై అభ్యర్ధులు, నిపుణులు సబ్జెక్టుల వారీగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

ఇందులో చాలా మంది విద్యార్థులు ఫిజిక్స్ పేపర్ సులభంగా ఉందని చెబుతున్నారు. మెకానిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్, మోడరన్ ఫిజిక్స్, వేవ్స్ వంటి అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయని చెప్పారు. ఏసీ, ఈఎంఐ, మాగ్నెటిజం నుండి ప్రశ్నలు ఎక్కువగా రాలేదు. అలాగే గత సంవత్సరాల్లో జరిగిన పరీక్షల్లో ప్రశ్నలు రిపీట్ కావడంతో అభ్యర్ధులకు ఈ పేపర్ సులువుగా అనిపించినట్లు తెలుస్తోంది.
కెమిస్ట్రీ పేపర్ చూస్తే మాత్రం ఇందులో అన్ని చాప్టర్లను సమానంగా కవర్ చేసినట్లు అర్ధమవుతోంది. చాలా ప్రశ్నలు అర్ధమమయ్యేలా ఉన్నప్పటికీ, కొన్ని థియరీ ఆధారిత ప్రశ్నలు మాత్రం గందరగోళంగా ఉన్నాయని అభ్యర్ధులు చెప్తున్నారు. ఎలక్ట్రోకెమిస్ట్రీ, కైనెటిక్స్, పీ-బ్లాక్, డీ-బ్లాక్, థర్మోడైనమిక్స్, బయోమోలిక్యూల్స్ వంటి అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు అడిగారు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కెమిస్ట్రీ పేపర్ బ్యాలెన్సెడ్ గానే ఉందంటున్నారు.
మ్యాథ్స్ పేపర్ విషయానికొస్తే... మీడియం నుంచి టఫ్ గా ఉందని చెప్తున్నారు. ప్రశ్నలు మరీ టఫ్ గా లేకపోయినా కొన్ని ప్రశ్నలకు సుదీర్ఘమైన లెక్కలు ఉన్నాయి. ప్రాబబిలిటీ, మ్యాట్రిక్స్, బీజగణితం, కాలిక్యులస్, వెక్టర్స్, కోఆర్డినేట్ జామెట్రీ, త్రీడీ , కాలిక్యులస్ పై ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయి. అయితే పేపర్ మొత్తంగా చూస్తే మాత్రం సమగ్రంగానే ఇచ్చారు. దాదాపు అన్ని ముఖ్యమైన అధ్యాయాలను కవర్ చేశారు.












Click it and Unblock the Notifications