హైదరాబాద్ ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు: మంచి జీతం, వెంటనే అప్లై చేయండి
హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఈఎస్ఐ ఆస్పత్రులు/డిస్పెన్సరీలు/ డయాగ్నస్టిక్ సెంటర్లలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
హైదరాబాద్: జిల్లా పరిధిలోని ఈఎస్ఐ ఆస్పత్రులు/డిస్పెన్సరీలు/ డయాగ్నస్టిక్ సెంటర్లలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ విధానంలో జాయింట్ డైరెక్టర్(మెడికల్), ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 114
వీటిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 59
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ -01
ల్యాబ్ టెక్నీషియన్ -11
ఫార్మసిస్ట్ -43 ఖాళీలు ఉన్నాయి.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమతి:
అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక:
అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
సీఏఎస్, డీఏఎస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.58,850; ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.31,040 ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 28-03-2023.
దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, 5వ అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పిటల్ సనత్‌నగర్, నాచారం, హైదరాబాద్ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://hyderabad.telangana.gov.in/












Click it and Unblock the Notifications