IB Recruitment: 10 అర్హత, మంచి జీతం; 677 పోస్టులకు అప్లై చేయండి
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని నిఘా విభాగం ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 677 ఉద్యోగాలకు త్వరలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటిలో 362 సెక్యూరిటీ అసిస్టెంట్- మోటార్ ట్రాన్స్‌పోర్ట్ (డ్రైవర్) పోస్టులు ఉండగా.. 315 మల్టీ టాస్కింగ్ సిబ్బంది పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత:
పదో తరగతి లేదా తత్సమాన కోర్సులు చేసినవారు ఈ ఉద్యోగులకు అర్హులుగా నిర్ణయించారు.

అభ్యర్థుల వయో పరిమితి:
సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు 27 ఏళ్లు మించరాదు. ఎంటీఎస్ పోస్టులకు 18-25 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ/ఎస్టీలకు పదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
వేతనం:
సెక్యూరిటీ అసిస్టెంట్- మోటార్ ట్రాన్స్ పోర్టు పోస్టులకు రూ. 21,700- రూ. 69,100 కాగా, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ. 18 వేల నుంచి రూ. 56,900.
దరఖాస్తు రుసుం:
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 500 (పరీక్ష ఫీజు రూ. 50, రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ఛార్జీ రూ. 450)
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు రూ. 450 (పరీక్ష ఫీజు మినహాయింపు)
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష (ఆబ్జెక్టివ్), డిస్క్రిప్టివ్ విధానంలో. డ్రైవింగ్ నైపుణ్యాలు, ఇంటర్వ్యూ, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:
అధికారిక వెబ్‌సైట్ mha.gov.inని సందర్శించండి
'IB రిక్రూట్‌మెంట్ 2023' అని ఉన్న లింక్‌ను నావిగేట్ చేయండి
మీరే నమోదు చేసుకోండి
దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
దరఖాస్తు రుసుము చెల్లించండి
దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి
భవిష్యత్ సూచన కోసం నిర్ధారణ పేజీ యొక్క ప్రింటవుట్ తీసుకోండి
అక్టోబర్ 14 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 13 తుది గడువు.












Click it and Unblock the Notifications