బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? బంపరాఫర్.. 13 వేలకు పైగా పోస్టులు!
IBPS RRB Vacancy 2025: బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్‌న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) గ్రామీణ బ్యాంకుల్లో(RRBs) 13 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయడానికి కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీసర్ స్కేల్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.ibps.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు
ఐబీపీఎస్ గ్రూప్ 'A' ఆఫీసర్ స్కేల్- I, II, III (IBPS RRB PO), గ్రూప్ 'B' ఆఫీస్ అసిస్టెంట్ (IBPS RRB క్లర్క్) పోస్టులకు సెప్టెంబర్ 1, 2025 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 21, 2025.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) -7972
ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్)-3907
ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్)- 854
ఆఫీసర్ స్కేల్-II (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్)- 87
ఆఫీసర్ స్కేల్-II (చార్టర్డ్ అకౌంటెంట్)-69
ఆఫీసర్ స్కేల్-II (లా ఆఫీసర్)-48
ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ ఆఫీసర్)-16
ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్)-15
ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్)-50
ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్)-199
మొత్తం ఖాళీలు 13,217
అర్హత, వయో పరిమితి
విద్యార్హతలు:
ఆఫీస్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆఫీసర్ స్కేల్-I: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఇతర పోస్టులు: ఇతర ఆఫీసర్ స్కేల్ పోస్టులకు సంబంధిత విభాగాలలో డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్, అనుభవం అవసరం. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
వయో పరిమితి (సెప్టెంబర్ 1, 2025 నాటికి):
ఆఫీస్ అసిస్టెంట్: 18 నుంచి 28 ఏళ్లు
ఆఫీసర్ స్కేల్-I: 18 నుంచి 30 ఏళ్లు
ఆఫీసర్ స్కేల్-II: 21 నుంచి 32 ఏళ్లు
ఆఫీసర్ స్కేల్-III: 21 నుంచి 40 ఏళ్లు
నిబంధనల ప్రకారం, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ
*అభ్యర్థులు www.ibps.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
*హోమ్‌పేజీలో 'CRP for RRBs' సెక్షన్‌పై క్లిక్ చేయాలి.
*అనంతరం, మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్టుకు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి.
*కొత్త అభ్యర్థులు 'CLICK HERE FOR NEW REGISTRATION' పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
*రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ వివరాలతో దరఖాస్తు ఫారంను పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లు, ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
*చివరగా, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు ఫీజు:
*ఆఫీసర్ స్కేల్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు: రూ. 850
*ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ. 175
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో ఉంటుంది. మొదట నవంబర్ 2025లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించవచ్చు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి డిసెంబర్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 మధ్య మెయిన్స్ పరీక్ష ఉంటుంది. మెయిన్స్‌లో అర్హత పొందిన అభ్యర్థులను ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల కోసం షార్ట్ లిస్ట్ చేస్తారు.












Click it and Unblock the Notifications