తెలంగాణ ఐ-సెట్ హాల్ టికెట్లు విడుదల: ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఐ-సెట్ (ICET 2024)కు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. జూన్ 5, 6 తేదీల్లో జరిగే ఈ పరీక్షకు సంబంధించి శుక్రవారం సాయంత్రం హాల్ టికెట్లను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

అధికారిక వెబ్‌సైట్ (https://icet.tsche.ac.in/TSICET/TSICET24_HTNew2024gkt.aspx)కు వెళ్లి రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా అభ్యర్థులు తమ హాల్ టికెట్లు పొందవచ్చు. షెడ్యూల్ ప్రకారం.. జూన్ 15న తెలంగాణ ఐసెట్ ప్రిలిమినరీ కీ విడుదల చేయనున్నారు. జూన్ 16 నుంచి 19 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు.

ICET hall tickets released in telangana

జూన్ 28న ఐసెట్ల ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా, ఐసెట్ పరీక్షకు ఈసారి రికార్డు స్థాయిలో 80 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

తెలంగాణ ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఈసెట్‌ (TG ECET) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. పాలిటెక్నిక్‌ డిప్లొమో విద్యార్థులు బీటెక్‌, బీఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్‌ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు పొందడం కోసం ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఇటీవల విడుదల చేసింది. రెండు విడతల్లో ఈ ప్రవేశాల ప్రక్రియను నిర్వహించనున్నారు.

తాజా షెడ్యూల్‌ ప్రకారం.. తొలి విడతలో జూన్‌ 8వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు అభ్యర్థులు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. స్లాట్ బుక్‌ చేసుకున్న అభ్యర్థులకు జూన్‌ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు.

ఇక, జూన్‌ 18న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. జూలై 15వ తేదీ నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. జూలై 21న తుది విడత సీట్లను కేటాయిస్తారు. జూలై 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్పాట్‌ ఆడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+