IDBIలో భారీగా పోస్టులు.. ఇప్పుడే అప్లై చేసుకోండి..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండస్ట్రియల్ డెవలెప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI)లో 650 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆసక్తికలిగిన అభ్యర్థులు మార్చి 12, 2025 లోపు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
మొత్తం పోస్టులు: 650 (యూఆర్ 260, ఎస్సీ 100, ఎస్టీ 54, ఈడబ్ల్యూఎస్ 65,ఓబీసీ 171, పీడబ్ల్యూడీ 26)
అర్హత: గ్రాడ్యుయేట్ డిగ్రీ, కంప్యూటర్ ప్రావిణ్యం, ప్రాంతీయ భాష పరిజ్ఞానం ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: మార్చి 1, 2025 నాటికి 20 నుంచి 25 ఏళ్లు ఉండాలి.
స్టైఫండ్, వేతనం: ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ. 5,000. ఇంటర్న్ షిప్ సమయంలో నెలకు రూ. 15,000. ఉద్యోగంలో చేరాక ఏడాదికి రూ. 6.14 లక్షల నుంచి రూ. 6.50 లక్షలు అందుతుంది.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు రూ. 250, ఇతరులకు రూ. 1,050 గా ఉంది.
పరీక్ష కేంద్రాలు: ముంబయి, దిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లఖ్ నవూ, పట్నా

ఎంపిక: ఆన్ లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం: మార్చి 1, 2025
దరఖాస్తు ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: మార్చి 12, 2025
ఆన్ లైన్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 06, 2025












Click it and Unblock the Notifications