IDBI Bankలో 1172 ఉద్యోగాలు: ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయండి, మంచి జీతం

హైదరాబాద్: ఇండియస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) పలు ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1172 పోస్టులకు రెండు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటిలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు 136, ఎగ్జిక్యూటివ్(కాంట్రాక్ట్) ఉద్యోగాలు 1036 చొప్పున ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్ 7తో ముగియనుంది. ఇక స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు మాత్రం జూన్ 1 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. బ్యాంకులోని వివిధ విభాగాల్లో 84 మేనేజర్ పోస్టులు, 46 అసిస్టెంట్ జనరల్ మేనేజర్, 6 డిప్యూటీ జనరల్ మేనేజర్ చొప్పున మొత్తం 136 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలన్నింటికీ గతంలో పనిచేసిన అనుభవం తప్పనిసరి కావడం గమనార్హం.

 IDBI Bank

ఈ రెండు నోటిఫికేసన్లలో పేర్కొన్న ఉద్యోగాలకు హోదాలను బట్టి నెలకు కనిష్టంగా రూ. 29 వేలు ఉండగా.. గరిష్టంగా 1,55,000 వరకు ఇవ్వనున్నారు. కాగా, ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం మే 24 నుంచి జూన్ 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జులై 2న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ పరీక్ష తేదీ మారే అవకాశం ఉంది.

ఈ పోస్టులకు వయో పరిమితి: 20 నుంచి 25 ఏళ్లు.

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఏడాదిపాటు ఒప్పంద ప్రాతిపదికన మాత్రమే ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఆ తర్వాత వారి పనితీరు ఆధారంగా ఏటా సర్వీసును పొడిగిస్తారు. తొలి ఏడాది వేతనం రూ. 29 వేలు, రెండో ఏడాది రూ. 31వేలు, మూడో సంవత్సరం రూ. 34 వేల చొప్పున ఇస్తారు.

ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము:
GEN, OBC, EWS దరఖాస్తు సమర్పణ రుసుము: రూ. 1000/-
SC, ST, PWD అభ్యర్థి కోసం ఫారమ్ సమర్పణ ఫీజు: రూ. 200/-

మరిన్ని వివరాలు, ఎగ్జిక్యూటివ్ పోస్టుల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
https://ibpsonline.ibps.in/idbiemar23/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+