Jobs: డిగ్రీ అర్హతతో ఉన్నత ఉద్యోగం.. రూ.2 లక్షలకు పైగా జీతం.

ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా పలు నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ముఖ్యమైన తేదీలు, ఖాళీల సంఖ్య, అర్హతలు, దరఖాస్తు విధానం మొదలైనవి ఇక్కడ తెలుసుకుందాం..

పోస్టుల సంఖ్య:

మొత్తం ఖాళీల సంఖ్య 34 ఉన్నాయి. సీనియర్ సూపరింటెండింగ్ ఇంజనీర్ 1, సూపరింటెండింగ్ ఇంజనీర్ 2, డిప్యూటీ రిజిస్ట్రార్ 2, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 2, అసిస్టెంట్ కౌన్సిలర్ 3, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 1, అసిస్టెంట్ రిజిస్ట్రార్ (లైబ్రరీ) 1, హాల్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ 1, మెడికల్ ఆఫీసర్ 2, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ 2, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ 2, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ 3, జూనియర్ అసిస్టెంట్ 12 పోస్టుల ఉన్నాయి.

IIT Kanpur Recruitment 2024-25 Apply for 34 Vacancies

వేతన వివరాలు:

వివిధ పోస్టులకు వేతనం మారుతూ ఉంటుంది. సాధారణంగా, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రారంభ వేతనం తక్కువగా ఉంటుంది. సీనియర్ పోస్టులకు వేతనం ఎక్కువగా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి వేతనం రూ.21,700 నుంచి గరిష్ట వేతనం రూ. 2.16 లక్షల వరకు ఉండవచ్చు. వేతనానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు.

అర్హతలు:

వివిధ పోస్టులకు విద్యార్హతలు , వయో పరిమితి వేర్వేరుగా ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్‌కు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. వయో పరిమితి 21 నుండి 30 సంవత్సరాలు ఉండాలి. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్/స్పోర్ట్స్ ఆఫీసర్ పోస్టుకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. వయో పరిమితి 21 నుండి 35 సంవత్సరాలు. అసిస్టెంట్ కౌన్సిలర్/రిజిస్ట్రార్/మెడికల్ ఆఫీసర్ పోస్టుకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. వయో పరిమితి 21 నుండి 45 సంవత్సరాలు. డిప్యూటీ రిజిస్ట్రార్/ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ మరియు పని అనుభవం ఉండాలి. వయో పరిమితి 21 నుండి 50 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు ఐఐటీ కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్ www.iitk.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ వెబ్ సైట్‌లో రిక్యూట్‌మెంట్ విభాగానికి వెళ్లి 'ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి' లింక్‌పై క్లిక్ చేయండి.'రిజిస్టర్ న్యూ యూజర్' పై క్లిక్ చేసి అవసరమైన వివరాలను నమోదు చేసుకోవాలి. అనంతరం, అప్లికేషన్ ఫారం నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. చివరగా, అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారం సబ్మిట్ చేయాలి.

దరఖాస్తు రుసుము:

గ్రూప్-ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1,000 (జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్), రూ.500 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్) చెల్లించాలి. గ్రూప్ బీ, సీ పోస్టులకు రూ.700 (జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్), రూ.350 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్) ఫీజు చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 27, 2024
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31, 2025

ఎంపిక విధానం:

అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ /లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఎంపిక విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో ఉంటాయి.

ముఖ్య గమనిక:

అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి. అప్లికేషన్ ఫారమ్‌ను జాగ్రత్తగా నింపాలి. చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+