ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బంపర్ ఆఫర్.. భారీ జీతంతో !!
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF) పలు ప్రతిష్టాత్మక పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశసేవతో పాటు ఆకర్షణీయమైన వేతనాలు.. భద్రమైన భవిష్యత్తు కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. AFCAT నోటిఫికేషన్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి మాత్రమే వస్తుంది.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 ప్రారంభ వేతనం లభిస్తుంది. డియర్‌నెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, మిలిటరీ సర్వీస్ పే, ఫీల్డ్ అలవెన్స్ లాంటి అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయి. సర్వీసులో ముందుకు సాగేకొద్దీ జీతం రూ.1,77,500 వరకు పెరుగుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

మొత్తం ఉద్యోగాలు..
340
ఖాళీల వివరాలు..
ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ: ఫ్లయింగ్/ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)/ గ్రౌండ్ డ్యూటీ (నాన్- టెక్నికల్)
ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ: ఫ్లయింగ్
విద్యార్హత..
ఫ్లయింగ్ బ్రాంచ్, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. ఇంటర్/ప్లస్ 2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో 50 శాతం చొప్పున మార్కులు తప్పనిసరి వచ్చి ఉండాలి.
ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ విభాగం పోస్టులకు ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ సి సర్టిఫికెట్ ఉండాలి.
విభాగాల వారీగా ఖాళీలు..
గ్రౌండ్ డ్యూటీ..
టెక్నికల్ బ్రాంచ్ లో ఏరోనాటిక్ ఇంజినీర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. సంబంధిత లేదా అనుబంధ బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీటెక్/బీఈ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. ఇంటర్/+2లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ల్లో 50 శాతం మార్కులు తప్పనిసరి ఉండాలి
గ్రౌండ్ డ్యూటీ..
నాన్ టెక్నికల్ బ్రాంచ్ లో విపన్ సిస్టం, అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మీటీయరాలజీ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో 50 శాతం మార్కులతోపాటు ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో పాసై ఉండాలి.
ఎంపిక విధానం..
ఆన్‌లైన్ AFCAT పరీక్ష - స్టేజ్-1 (Screening Test), స్టేజ్-2 (Psychological, Group Tests, Interview)
మెడికల్ పరీక్షలు
సర్టిఫికేట్ వెరిఫికేషన్
ఫైనల్ మెరిట్ లిస్ట్
ఈ పరీక్షలను క్లియర్ చేసిన అభ్యర్థులు వాయుసేన అకాడమీలో అధునాతన శిక్షణ పొందుతారు.
దరఖాస్తు రుసుము..
AFCAT ఎంట్రీ: రూ.550
NCC స్పెషల్ ఎంట్రీ: ఫీజు లేదు
ఎయిర్‌ఫోర్స్ అభ్యర్థులకు లభించే ప్రయోజనాలు..
ఉన్నతోద్యోగ భద్రత
ప్రభుత్వ వైద్య సేవలు
సబ్సిడీడ్ హౌసింగ్
Children's education facilities
లీవ్ ట్రావెల్ కాన్సెషన్స్
పెన్షన్ & గ్రాచ్యుయిటీ ప్రయోజనాలు
దరఖాస్తు విధానం..
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్‌ను సమర్పించాలి. ఆధార్, విద్యార్హత సర్టిఫికేట్లు, ఫోటో, సంతకం వంటి డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధంగా ఉంచితే అప్లికేషన్ ప్రాసెస్ సులభంగా జరుగుతుంది.
దరఖాస్తు గడువు..
17 నవంబర్ 2025 నుంచి 14 డిసెంబర్ 2025 వరకు
AFCAT పరీక్ష తేదీ: 31 జనవరి 2026
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications