Indian Armyలో లెఫ్ట్‌నెంట్ ర్యాంక్ పోస్టులు: అర్హతలు ఇవే..!!
ఇండియన్ ఆర్మీలో పనిచేయాలనుకుంటున్నారా.. భారత సైన్యంలో పనిచేస్తూ దేశానికి సేవ చేయాలని భావిస్తున్నారా.. అయితే ఆ చక్కటి అవకాశం యువతకు కల్పిస్తోంది ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ నుంచి లెఫ్ట్‌నెంట్ ర్యాంకింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపిక టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ఆధారంగా ఉంటుంది. ఇక పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగ యువత కోసం గుడ్ తెలిపింది భారత ఆర్మీ. ఇందులో భాగంగా లెఫ్ట్‌నెంట్ ర్యాంకింగ్‌తో సమానంగా ఉండే పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలను టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ద్వారా భర్తీ చేస్తారు. మొత్తం 134 పోస్టులను భర్తీ చేయనుంది. ఇక ఏయే విభాగంలో ఎన్నిపోస్టులున్నాయనే అంశాలు ఇలా ఉన్నాయి.

సివిల్/ బిల్డింగ్ కన్స్‌ట్రక్షన్ టెక్నాలజీలో 10 పోస్టులు, ఆర్కిటెక్చర్‌లో ఒక పోస్టు, మెకానికల్ విభాగంలో 2 పోస్టులు, ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్ విభాగంలో 03 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్‌లో 8 పోస్టులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 03 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్‌లో 01 పోస్టు, మైక్రో ఎలక్ట్రానిక్స్ మరియు మైక్రోవేవ్‌లో ఒక పోస్టు, ఏరోనాటికల్ /ఏరో స్పేస్‌లో ఒక పోస్టు, ఏవియానిక్స్‌లో ఒక పోస్టు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్‌ట్రుమెంటేషన్‌లో రెండు పోస్టులు, ఫైబర్ ఆప్టిక్స్‌లో ఒక పోస్టు, ప్రొడక్షన్‌లో 01 పోస్టు, ఇండస్ట్రియల్/మానుఫాక్చరింగ్/ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఒక పోస్టు, వర్క్‌షాప్ టెక్నాలజీలో ఒక పోస్టు ఉన్నాయి.
ఇండియన్ ఆర్మీలో పై విభాగాల్లో పేర్కొన్న పోస్టులకు ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులు అర్హులు. ఇక ఫైనల్ ఇయర్ ఇంజినీరింగ్ చదువుతున్న వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేయొచ్చు. ఇక తాము ఇంజినీరింగ్ చదువుతున్నట్లుగా చెప్పేందుకు 1 జనవరి 2022 వరకు ఆయా సెమిస్టర్లు లేదా మూడు సంవత్సరాల మార్క్‌షీట్లు రుజువుగా పొందుపర్చాల్సి ఉంటుంది. ఇండియన్ ఆర్మీ టీజీసీకి అప్లయ్ చేసే అభ్యర్థుల వయసు 1 జనవరి 2022 నాటికి 20 నుంచి 27 మధ్య ఉండాలి. అంటే అభ్యర్థి 02 జనవరి 1995 నుంచి 01 జనవరి 2022 మధ్య జన్మించి ఉండాలి.
ఇక ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ప్రవేశం కోసం ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది:
* అప్లికేషన్లను షార్ట్ లిస్టు చేయడం
* ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందో అభ్యర్థికి తెలియజేయడం
* సర్వీస్ సెలెక్షన్ బోర్డు (ఎస్ఎస్‌బీ) ఇంటర్వ్యూ
* మెడికల్ ఎగ్జామినేషన్
ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజులు చెల్లించాల్సిన పనిలేదు. ఇక లెఫ్ట్‌నెంట్ ర్యాంక్ పోస్టుకు సంబంధించి వేతనం నెలకు రూ.56,100 - నుంచి 1,77,500 ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ 17 ఆగష్టు 2021న ప్రారంభమైంది. అప్లికేషన్ పూర్తి చేసేందుకు చివరి తేదీ 15 సెప్టెంబర్ 2021. ఇక పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.joinindianarmy.nic.in












Click it and Unblock the Notifications