టెన్త్, ఇంటర్ పాస్ తో ..నేవీలో ఉద్యోగం..40 వేలు జీతం..

నేవీలో ఆఫీసర్ కావాలని మీ కోరికనా. అయితే కేవలం టెన్త్, ఇంటర్ అర్హతతోనే భారత తీర దళంలో ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. నావిక్‌ జనరల్‌ డ్యూటీ, నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇండియన్‌ కోస్ట్​ గార్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రెండు విభాగాల్లో మొత్తం 300 ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

నావిక్‌ డొమెస్టిక్‌ విభాగంలో 40 పోస్టులు ఉన్నాయి. ఈ బ్రాంచీకి ఎంపికైనవారు కుకింగ్, స్టివార్డ్‌ పనులు చేస్తారు. టెన్త్​ పాసైనవారు పోటీ పడవచ్చు. ఇక నావిక్‌ జనరల్‌ విభాగంలో 260 పోస్టులు ఉన్నాయి. ఇంటర్​ (మ్యాథ్స్, ఫిజిక్స్‌) పాసైనవారు అర్హులు. వీరు సంబంధిత ట్రేడ్​లలో విధులు నిర్వర్తిస్తారు.

వయోపరిమితి: రెండు పోస్టులకూ 2003 సెప్టెంబరు 1 - 2007 ఆగస్టు 31 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్టీ, ఎస్సీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ : ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఆన్‌లైన్​లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఫీజు : రూ.300 ఫీజు చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

పరీక్షలు: స్టేజ్‌ 1 పరీక్షలు ఏప్రిల్‌లో, స్జేజ్‌ 2 పరీక్షలు జూన్‌లో, స్టేజ్‌ 3 పరీక్షలు సెప్టెంబరులో ఉంటాయి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://joinindiancoastguard.cdac.in/cgcat/లోకి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Indian Coast Guard Announces 300 Vacancies for Sailor General Duty and Sailor Domestic Branch

పరీక్ష విధానం : ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. 60 మార్కులకు 60 ప్రశ్నలు అడుగుతారు. (మ్యాథ్స్‌ 20, ఇంగ్లిష్‌ 15, రీజనింగ్‌ 10, సైన్స్‌ 10, జీకే 5 ప్రశ్నలుంటాయి. పరీక్ష టైమ్ 45 నిమిషాలు. పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ, ఫిట్ నెస్ టెస్టు ఉంటాయి. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపికైన జాబితా రిలీజ్ చేస్తారు. జాబ్ లో జాయిన్ అయ్యాక మొదటి నెల జీతమే దాదాపు రూ.40 వేలు అందుకుంటారు. భవిష్యత్తులో లెవెల్‌-8 (ప్రధాన అధికారి) స్థాయి వరకు చేరుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+