ఇండియన్ కోస్టు గార్డు రిక్రూట్ మెంట్: వివిధ క్యాటగిరీలో పోస్టులు.. 2.25 లక్షల వరకు జీతం

ఇండియన్ కోస్ట్ గార్డు వివిధ కొలువులకు జాబ్ ఆఫర్ చేస్తోంది. వివిధ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తు చేయాలని కోరింది. అసిస్టెంట్ కమాండెంట్ పోస్టు.. తదితర ఉద్యోగాలు ఉన్నాయి. తమ ఆఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్లి ఆప్లై చేయాలని కోరింది. డిసెంబర్ 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆప్లై చేసుకునే వెసులుబాటు కల్పించింది. జనరల్ డ్యూటీలో 50 పోస్టులు, సీపీఎల్, టెక్నికల్ కోర్సులకు దరఖాస్తు చేయాలని కోరింది.

పరీక్ష తేదీని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ఈ నెల 28వ తేదీ తర్వాత అడ్మిట్ కార్డు జారీ చేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. జీడీలో 30 పోస్టులు, సీపీఎల్ 10 పోస్టులు, టెక్నికల్ 10 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ కమాండెంట్‌కు రూ.56 వేలు, డిప్యూటీ కమాండెంట్‌కు 67 వేలు, కమాండెంట్‌కు (జేజీ) 78 వేలు, కమాండెంట్ లక్ష 23 వేలు, డిప్యూటీ ఇన్స్ పెక్టర్ జనరల్ లక్ష 31 వేలు, ఇన్ స్పెక్టర్ జనరల్ లక్ష 44 వేలు, అడిషనల్ డైరెక్టర్ జనరల్ లక్ష 82 వేలు, డైరెక్టర్ జనరల్ 2 లక్షల 25 వేలు జీతం ఆఫర్ చేస్తోంది.

Indian Coast Guard Recruitment 2021: Salary Up to Rs 2.25 Lakh, Registration Begins Today

Recommended Video

    సీఎం కేసీఆర్ పై మండి పడ్డ ఉస్మానియా యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డులు!! || Oneindia Telugu

    రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చినవారికి ప్రయారిటీ ఇస్తారు. అలా వారిని షర్ట్ లిస్ట్ చేసి.. ప్రిలిమినరీ సెలక్షన్ చేస్తారు. ప్రిలిమినరీ సెలక్షన్ పాస్ అయితే.. ఫైనల్ సెలక్షన్‌కు పిలుస్తారు. సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ద్వారా జాబ్ ఆఫర్ చేస్తారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+