ఇండియన్ రైల్వే తీపికబురు.. 2570 జేఈ పోస్టులకు నోటిఫికేషన్ !!
ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారీ శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2570 జూనియర్ ఇంజనీర్ (JE) ఖాళీలతో పాటు DMS, CMA పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, బీఈ, బీటెక్ లేదా డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాలతో వేలాది మంది టెక్నికల్ స్టూడెంట్స్‌కు అవకాశం లభించనుంది. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 30, 2025లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
మొత్తం ఖాళీలు..
2570
పోస్టులు..
- జూనియర్ ఇంజనీర్
- డీఎంఎస్
- సీఎంఏ

విద్యార్హత..
- జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా బీఈ/బీటెక్ డిగ్రీ పాస్ అయి ఉండాలి.
- డీఎంఎస్ పోస్టులకు ఏదైనా విభాగంలో మూడేళ్ల డిప్లొమా
- సీఎంఏ పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీతో బీఎస్సీ డిగ్రీలో కనీసం 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయో పరిమితి..
అభ్యర్ధులు కనీస వయసు 18 సంవత్సరాలు.. అలానే గరిష్ఠ వయసు 33 సంవత్సరాలుగా నిర్ణయించారు.
వయో సడలింపులు..
- OBC - 3 ఏళ్లు
- SC/ST - 5 ఏళ్లు
- దివ్యాంగులు - 10 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ..
- ఎంపిక పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆధారంగా ఉంటుంది.
- CBT-1: ప్రాథమిక పరీక్ష (జనరల్ అవేర్‌నెస్, మ్యాథ్స్, రీజనింగ్ )
- CBT-2: సబ్జెక్ట్‌కు సంబంధించిన టెక్నికల్ ప్రశ్నలు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్
- తుది ఎంపిక CBT-2లో సాధించిన మెరిట్ ఆధారంగానే ఉంటుంది.
జీతం & ప్రయోజనాలు..
- ప్రాథమిక జీతం: రూ. 35,400/- (లెవెల్-6 పే స్కేల్ ప్రకారం)
- అదనపు అలవెన్సులు: DA, HRA, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ మొదలైనవి.
- ప్రత్యేక రైల్వే బెనిఫిట్స్:
- ఫ్యామిలీకి ఫ్రీ ట్రైన్ పాస్
- ఉచిత మెడికల్ సదుపాయాలు
- పిల్లల విద్యా సహాయం
- నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)
దరఖాస్తు ఫీజు..
- జనరల్/OBC: రూ. 500 (పరీక్ష రాసిన తర్వాత రూ. 400 రీఫండ్)
- SC/ST, మహిళలు, దివ్యాంగులు: రూ. 250 (పరీక్ష రాసిన తర్వాత మొత్తం రీఫండ్)
దరఖాస్తు గడువు..
- అక్టోబర్ 31, 2025 నుంచి నవంబర్ 30, 2025 వరకు
స్థిరమైన జీతం, భద్రమైన భవిష్యత్తు, కుటుంబానికి సౌకర్యాలు కావాలి అనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలి.












Click it and Unblock the Notifications