భారీ జీతంతో ఆర్ఆర్‌బీ జేఈ పోస్టులు.. అప్లై చేసిన వారు ఇవి గమనించారా !!
భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) కీలక ప్రకటన జారీ చేసింది. ఇటీవలే 2570 జూనియర్ ఇంజనీర్ (JE) ఖాళీలతో పాటు DMS, CMA పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, బీఈ, బీటెక్ లేదా డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అయితే ఇప్పుడు జమ్మూ-శ్రీనగర్, చెన్నై ప్రాంతాలలో ఖాళీల సంఖ్య పెరిగినట్లు ఆర్‌ఆర్‌బీ స్పష్టం చేసింది. దీంతో మొత్తం పోస్టులు సంఖ్య 2,588కి చేరింది. కాగా జూనియర్ ఇంజనీర్, డిపొ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు ఈ పెంపు వర్తిస్తుంది. అంతే కాకుండా ఆన్‌లైన్ దరఖాస్తు గడువును 10 రోజులు పొడిగించినట్లు ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది.
అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఆర్‌ఆర్‌బీ, పోస్టు ప్రాధాన్యత, రైల్వే జోన్/ప్రొడక్షన్ యూనిట్ ప్రాధాన్యతలను ఎటువంటి రుసుము లేకుండా మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ సదుపాయం నవంబర్ 25 నుండి అందుబాటులోకి రానుండగా.. దరఖాస్తు గడువు డిసెంబర్ 10 వరకు పొడిగించారు. దరఖాస్తు రుసుము చెల్లింపునకు డిసెంబర్ 12.. దరఖాస్తు సవరణకు డిసెంబర్ 13 నుండి 22 వరకు అనుమతి ఇచ్చారు. అభ్యర్ధులు ఈ కీలక అప్డేట్ గమనించాలని ఆర్‌ఆర్‌బీ అనౌన్స్ చేసింది.

మొత్తం ఖాళీలు..
2,588
పోస్టులు..
- జూనియర్ ఇంజనీర్
- డీఎంఎస్
- సీఎంఏ
విద్యార్హత..
- జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా బీఈ/బీటెక్ డిగ్రీ పాస్ అయి ఉండాలి.
- డీఎంఎస్ పోస్టులకు ఏదైనా విభాగంలో మూడేళ్ల డిప్లొమా
- సీఎంఏ పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీతో బీఎస్సీ డిగ్రీలో కనీసం 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయో పరిమితి..
అభ్యర్ధులు కనీస వయసు 18 సంవత్సరాలు.. అలానే గరిష్ఠ వయసు 33 సంవత్సరాలుగా నిర్ణయించారు.
వయో సడలింపులు..
- OBC - 3 ఏళ్లు
- SC/ST - 5 ఏళ్లు
- దివ్యాంగులు - 10 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ..
ఎంపిక పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆధారంగా ఉంటుంది.
CBT-1: ప్రాథమిక పరీక్ష ( జనరల్ అవేర్‌నెస్, మ్యాథ్స్, రీజనింగ్ )
CBT-2: సబ్జెక్ట్‌కు సంబంధించిన టెక్నికల్ ప్రశ్నలు
తరువాత: డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్
తుది ఎంపిక CBT-2లో సాధించిన మెరిట్ ఆధారంగానే ఉంటుంది.
జీతం & ప్రయోజనాలు..
ప్రాథమిక జీతం: రూ. 35,400/- (లెవెల్-6 పే స్కేల్ ప్రకారం)
అదనపు అలవెన్సులు: DA, HRA, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ మొదలైనవి.
ప్రత్యేక రైల్వే బెనిఫిట్స్..
- ఫ్యామిలీకి ఫ్రీ ట్రైన్ పాస్
- ఉచిత మెడికల్ సదుపాయాలు
- పిల్లల విద్యా సహాయం
- నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)
దరఖాస్తు ఫీజులు..
- జనరల్/OBC: రూ. 500 (పరీక్ష రాసిన తర్వాత రూ. 400 రీఫండ్)
- SC/ST, మహిళలు, దివ్యాంగులు: రూ. 250 (పరీక్ష రాసిన తర్వాత మొత్తం రీఫండ్)
స్థిరమైన జీతం, భద్రమైన భవిష్యత్తు, కుటుంబానికి సౌకర్యాలు కావాలి అనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలి.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications