Intelligence Bureauలో 1671 ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి, మంచి జీతం
న్యూఢిల్లీ: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెం ట్ ప్రాతిపదికన 1671 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్: 1521 పోస్టులు
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్): 150 పోస్టులు
అర్హతలు:
మెట్రిక్యూలేషన్ ఉత్తీర్ణతతోపాటు స్థానిక భాషపై అవగాహన ఉండాలి.

వయో పరిమితి:
25.11.2022 నాటికి ఎస్ఏ/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 25 ఏళ్లు, ఎంటీస్ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ:
టైర్-1, టైర్-2, టైర్-3 పరీక్షల ఆధారంగా.
పరీక్ష ఫీజు: రూ. 500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ. 50)
అన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 05.11.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.11.2022
జీతం వివరాలు:
SA/Exe- పే స్థాయి 3- రూ. 21,700 నుంచి రూ. 69,100
MTS- పే లెవల్ 1- రూ 18,000 నుంచి రూ 56,900
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications