IOCLలో ఉద్యోగాలు: 527 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వెంటనే అప్లై చేయండి
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 527 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు డిసెంబర్ 4ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులు తూర్పు భారతదేశంలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. ఎంపికైన వారికి అప్రంటీస్ యాక్ట్ 1961 లేదా 1973 ప్రకారం నెల వారీగా స్టైఫండ్ చెల్లించనున్నట్లు వెల్లడించారు.

ఖాళీల వివరాలు:
ట్రేడ్ అప్రంటీస్, టెక్నికల్ అప్రంటీస్, ట్రేడ్ అప్రంటీస్ అకౌంటెంట్, ట్రేడ్ అప్రంటీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ట్రేడ్ అప్రంటీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ట్రేడ్ అప్రంటీస్ రిటైల్ సేల్స్ అసోసియేట్(ఫ్రెషర్), ట్రేడ్ అప్రంటీస్ రిటైల్ సేల్స్ అసోసియేట్(స్కిల్డ్ సర్టిఫికేట్ హోల్డర్స్) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు:
ట్రేడ్ అప్రంటీస్:
10వ తరగతితో పాటు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మర్చంట్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ లో ఐటీఐ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
టెక్నీషియన్ అప్రంటీస్:
మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ట్రేడ్ అప్రంటీస్ అకౌంటెంట్:
50 శాతం మార్కులతో డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ట్రేడ్ అప్రంటీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్(ఫ్రెషర్ అప్రంటీస్):
12వ తరగతి విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.
ట్రేడ్ అప్రంటీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్(స్కిల్డ్ సర్టిఫికేట్ హోల్డర్స్):
ఇంటర్ లేదా 'డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్' విభాగంలో స్కిల్ సర్టిఫికేట్ కలిగిన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ట్రేడ్ అప్రంటీస్-రిటైల్ సేల్స్ అసోసియేట్(ఫ్రెషర్):
ఇంటర్ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ట్రేడ్ అప్రంటీస్-రిటైల్ సేల్స్ అసోసియేట్(స్కిల్డ్ సర్టిఫికేట్ హోల్డర్స్): ఇంటర్ పాసవడంతో పాటు రిటైల్ ట్రైనీ అసోసియేట్ స్కిల్ సర్టిఫికేట్ కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు, ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.iocl.com సంప్రదించి తెలుసుకోవచ్చు.












Click it and Unblock the Notifications