IRCONలో ఉద్యోగాలు: ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటే పరీక్షలేకుండానే..వివరాలు ఇవే.!!
రైల్వేలో ఉద్యోగం పొందాలనుకుని ఎదురు చూసే వారికి శుభవార్త. ఇండియన్ రైల్వేస్ అనుబంధ సంస్థగా కొనసాగుతోన్న ఇండియన్ రైల్వే కన్స్‌ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ పలు మేనేజర్ మరియు ఇంజినీర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అందులో పొందుపర్చింది. ఇండియన్ రైల్వే కన్స్‌ట్రక్షన్ లిమిటెడ్ (ఇర్కాన్) అనే ఈ సంస్థ ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఇంజినీరింగ్ మరియు కన్స్‌ట్రక్షన్ కార్పొరేషన్‌కు అనుబంధంగా ఉంది. ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దీని ప్రత్యేకత. కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం రైల్వేస్ ఈ సంస్థను 1976లో ఏర్పాటు చేసింది.
ఇక ఇర్కాన్ విడుదల చేసిన నోటిఫికేషన్ విషయానికొస్తే ఈ సంస్థలో మొత్తం 29 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. అవి మేనేజర్ మరియు ఇంజినీర్ పోస్టులు. ఈ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా ఎలాంటి పరీక్షను నిర్వహించడం లేదు. కేవలం వాక్-ఇన్- ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఈ నియామకాలు పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికనే ఉంటాయి. పోస్టుల పరంగా చూస్తే మేనేజర్ (సివిల్ ఇంజినీరింగ్)- 6 పోస్టులు, మేనేజర్ (ఎస్&టీ) -6 పోస్టులు మేనేజర్ (OHE)-17 పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు అర్హత వివరాలు ఇలా ఉన్నాయి. మేనేజర్ (సివిల్ ఇంజినీరింగ్)కు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీతో పాటు ఐదేళ్ల పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.మేనేజర్ (ఎస్&టీ)కు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్స్‌ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ మరియు ఇన్స్‌ట్రుమెంటేషన్ మరియు కంట్రోల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో డిగ్రీతో పాటు ఐదేళ్ల పని అనుభవం తప్పనిసరి. మేనేజర్ (OHE) కి గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీతో పాటు ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. ఇక వేతనం విషయానికొస్తే నెలకు రూ.60వేలు చెల్లిస్తారు.
ఇక అర్హులైన అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 50 ఏళ్లు ఉండాలని అయితే ప్రభుత్వం సూచించిన రిజర్వేషన్లు వర్తిస్తాయని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. అభ్యర్థుల ఎంపిక వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. అభ్యర్థులు 16 ఆగష్టు 2021 నుంచి 20 ఆగష్టు 2021 వరకు జరిగే వాక్-ఇన్-ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. ఎంపికైన అభ్యర్థులు రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, అస్సాం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో చేపట్టే ప్రాజెక్టుల్లో పోస్టింగ్ ఇస్తారు.
అభ్యర్థులు తమ ఒరిజినల్ డాక్యుమెంట్స్‌తో పాటు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు, డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు కూడా ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇలా ఉంది.
మేనేజర్ (సివిల్ ఇంజినీరింగ్): 16 ఆగష్టు 2021న ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు.
మేనేజర్ (ఎస్&టీ) 18 ఆగష్టు 2021న ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు.
మేనేజర్(OHE):20 ఆగష్టు 2021న ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం:
Ircon International Limited
Recommended Video
C-4 District centre,
Saket, New Delhi-110017
-
తిరుపతికి వెళ్లే ఈ ప్రధాన రైళ్లల్లో కీలక మార్పులు, ఇక నుంచి..!! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications