Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IRCONలో ఉద్యోగాలు: వర్క్స్‌ ఇంజినీర్ మరియు సూపర్‌వైజర్ పోస్టులు.. నో ఎగ్జామ్..!!

రైల్వేలో ఉద్యోగం పొందాలనుకుని ఎదురు చూసే వారికి శుభవార్త. ఇండియన్ రైల్వేస్ అనుబంధ సంస్థగా కొనసాగుతోన్న ఇండియన్ రైల్వే కన్స్‌ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ పలు వర్క్స్ ఇంజినీర్ మరియు సైట్ సూపర్‌వైజర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అందులో పొందుపర్చింది. ఇండియన్ రైల్వే కన్స్‌ట్రక్షన్ లిమిటెడ్ (ఇర్కాన్) అనే ఈ సంస్థ ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఇంజినీరింగ్ మరియు కన్స్‌ట్రక్షన్ కార్పొరేషన్‌కు అనుబంధంగా ఉంది. ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దీని ప్రత్యేకత. కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం రైల్వేస్ ఈ సంస్థను 1976లో ఏర్పాటు చేసింది.

ఇక ఇర్కాన్ విడుదల చేసిన నోటిఫికేషన్ విషయానికొస్తే ఈ సంస్థలో మొత్తం 34 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. అవి వర్క్స్ ఇంజినీర్ మరియు సైట్ సూపర్‌వైజర్‌ పోస్టులు. ఈ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా ఎలాంటి పరీక్షను నిర్వహించడం లేదు. కేవలం వాక్-ఇన్- ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఈ నియామకాలు పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికనే ఉంటాయి. పోస్టుల పరంగా చూస్తే వర్క్స్ ఇంజినీర్- 21 పోస్టులు, సైట్ సూపర్‌వైజర్‌ -13 పోస్టులు ఉన్నాయి.

IRCON Recruitment 2021:Walk in Interview for works engineer and Site supervisor posts

ఈ పోస్టులకు అర్హత వివరాలు ఇలా ఉన్నాయి. వర్క్స్ ఇంజినీర్‌కు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీతో పాటు ఏడాది పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.సైట్ సూపర్‌వైజర్‌కు కూడా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీతో పాటు ఏడాది పని అనుభవం తప్పనిసరి. ఇక వేతనం విషయానికొస్తే వర్క్స్ ఇంజినీర్‌కు నెలకు రూ.36వేలు చెల్లిస్తారు. అదే సైట్ సూపర్‌వైజర్‌కు రూ.25వేలు చెల్లిస్తారు.

ఇక అర్హులైన అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలని అయితే ప్రభుత్వం సూచించిన రిజర్వేషన్లు వర్తిస్తాయని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. అభ్యర్థుల ఎంపిక వాక్‌-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. అభ్యర్థులు 25 ఆగష్టు 2021 నుంచి 27 ఆగష్టు 2021 వరకు జరిగే వాక్-ఇన్-ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలు బిలాస్‌పూర్, జైపూర్, బరేలీ, అస్సాంలోని తిన్సుకియా, పశ్చిమబెంగాల్‌లోని అలీపూర్‌ద్వార్‌లో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.

అభ్యర్థులు తమ ఒరిజినల్ డాక్యుమెంట్స్‌తో పాటు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు, డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు కూడా ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇలా ఉంది.

వర్క్స్ ఇంజినీర్: 25 ఆగష్టు 2021న ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు.

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.

సైట్ సూపర్‌వైజర్‌కు 27 ఆగష్టు 2021న ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ప్రదేశం కోసం అధికారిక నోటిఫికేషన్ చూడాల్సి ఉంటుంది.

Recommended Video

    MS Dhoni వచ్చాక మొత్తం మారిపోయింది.. ఎప్పుడూ కుంగిపోలేదు..! - Dinesh Karthik || Oneindia Telugu

    ఇక పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.ircon.org

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+