ఇస్రో ఉచిత సర్టిఫికెట్ కోర్సు: వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) విద్యార్థులకు మంచి అవకాశాన్ని కల్పించింది. ఇస్రోకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(IIRS) డెహ్రాడూన్ కొత్త సర్టిఫికెట్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. సింథటిక్ అపార్చుర్ రాడార్(SAR) డేటా ప్రాసెసింగ్‌పై అందిస్తున్న ఈ కోర్సులో విద్యార్థులతోపాటు పరిశోధకులు, ప్రభుత్వ సైంటిఫిక్ సిబ్బంది చేరవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
కాగా, ఐఐఆర్ఎస్ అందిస్తున్న ఈ కోర్సు పూర్తిగా ఉచితం. ఏప్రిల్ 10న ప్రారంభమైన ఏప్రిల్ 14తో ముగుస్తుంది. ఒక్కో సెషన్ గంటన్నరపాటు సాగుతుది. సాయంత్రం 4 గంటల నుంచి 5.30 మధ్య ఆన్‌లైన్ సెషన్ ఉంటుంది. ఈ కోర్సులో పాల్గొనదలిచిన వారు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

ఈ కోర్సులో చేరే వారికి రిమోట్ సెన్సింగ్, డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్‌పై కనీస పరిజ్ఞానం ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన టెక్నికల్/సైంటిఫిక్ సిబ్బంది/ఫ్యాకల్టీ, యూనివర్సిటీ/ఇనిస్టిట్యూట్‌లోని పరిశోధకులు కూడా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు 70 శాతం హాజరు కలిగిన వారికి మాత్రమే సర్టిఫికెట్ అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచే సంస్థలు, యూనివర్సిటీలు, డిపార్ట్‌మెంట్లు సొంతంగా కో-ఆర్డినేటర్‌ను నియమించుకోవాల్సి ఉంటుంది. సదరు కో-కోర్డినేటర్ ఐఐఆర్ఎస్ వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి.
కోర్సులో చేరాలనుకునేవారు https://elearning.iirs.gov.in/edusatregistration/ వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలి.












Click it and Unblock the Notifications