ఇస్రో లో భారీ వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
కేంద్ర ప్రభుత్వ సంస్థ, ప్రతిష్టాత్మక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)లో ఉద్యోగం సాధించాలని చాలా మంది కల. అలాంటి వారికోసం సువర్ణావకాశం. ఇస్రోలో ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం నోటిఫికేషన్ వెలువడింది. బీటెక్ చేసిన విద్యార్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 63 సైంటిస్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్: http://www.isro.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మొత్తం పోస్టులు: 63 సైంటిస్ట్/ ఇంజినీరింగ్ పోస్టులు కాగా.. ఎలక్ట్రానిక్స్ విభాగంలో 22
మెకానికల్ విభాగంలో 33, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

అర్హత: అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో బీఈ లేదా బీటెక్ డిగ్రీని 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాక 2024 లేదా 2025 గేట్ స్కోరు కూడా కలిగి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.250 కాగా.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, మహిళలకు మాత్రం ఎలాంటి ఫీజు లేదు.
వేతనం: రూ.56,100 వరకు ఉంటుంది. వేతనానికి అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ, న్యూ పెన్షన్ స్కీమ్/ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, వ్యక్తిగత, కుటుంబసభ్యులకు వైద్య సదుపాయాలు, ఎల్టీఏ, గ్రూప్ ఇన్సూరెన్స్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ మొదలైన సదుపాయాలు కూడా ఉంటాయి. అంతేకాక పర్ఫామెన్స్ ను బట్టి పదోన్నతి కూడా ఉంటుంది.
ఎంపిక విధానం : అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. టెక్నికల్ (అకడమిక్) నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 20 మార్కులు, కమ్యూనికేషన్ స్కిల్ కు 20 మార్కులు, కాంప్రహెన్షన్ 10 మార్కులు, అకడమిక్ అచీవ్మెంట్స్ కు 10 మార్కులు ఉంటాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇప్పుడే అప్లై చేసుకోండి.












Click it and Unblock the Notifications