ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. పరీక్ష లేదు.. రూ.58,000 వేతనం

ప్రతిష్టాత్మక ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ISRO)లో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా.. ? అయితే మీకో సువర్ణావకాశం. ఇస్రో నుంచి జేఆర్‌ఎఫ్‌ రిక్రూట్‌మెంట్‌ 2025 విడుదలైంది. జూనియర్ రీసెర్చ్‌ ఫెలో, రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 20వ తేదీ వరకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో 21, రీసెర్చ్‌ అసోసియేట్‌ 02

అప్లికేషన్ ప్రారంభ తేదీ: మార్చి 22, 2025

అప్లికేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 20, 2025

ISRO Opens Applications for Junior Research Fellow and Research Associate Positions Apply by April 20th

అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాక సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఏప్రిల్ 20, 2025 నాటికి జూనియర్ రీసెర్చ్‌ ఫెలోకు 28 ఏళ్లు, రీసెర్చ్‌ అసోసియేట్‌కు 35 ఏళ్లులోపు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

వేతనం: జూనియర్ రీసెర్చ్‌ ఫెలోకు రూ.37,000, రీసెర్చ్‌ అసోసియేట్‌కు రూ.58,000 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇంటర్వ్యూ తేదీలను త్వరలో అధికారికంగా తెలియజేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+