ISROలో ఆఫీసర్ ఉద్యోగాలు: మంచి జీతం..అర్హతలు ఇవే..!
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 24 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్, పర్చేస్ మరియు స్టోర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 21 ఏప్రిల్ 2021.
సంస్థ పేరు: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్, పర్చేస్ మరియు స్టోర్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 24
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 21 ఏప్రిల్ 2021

విద్యార్హతలు:
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎంబీఏ/ డిగ్రీ/పీజీ డిగ్రీ
అకౌంట్స్ ఆఫీసర్: ఏసీఏ/ఎఫ్‌సీఏ/ ఎంబీఏ/బీకాం/ఎంకాం
పర్చేస్ మరియు స్టోర్స్ ఆఫీసర్: ఎంబీఏ/డిగ్రీ/పీజీ డిగ్రీ
వయస్సు: 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.250/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 ఏప్రిల్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 21 ఏప్రిల్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/31EcGml












Click it and Unblock the Notifications