ఇస్రోలో భారీగా ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి, రూ. 50వేలకుపైగా జీతం
హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO)లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు/యూనిట్లలో సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 303 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇస్రోలోని ఎలక్ట్రానిక్స్, మెకానిక్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో మొత్తం 303 సైంటిస్ట్/ఇంజినీర్(ఎస్సీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సైంటిస్ట్/ఇంజినీర్ ఎస్‍సీ (ఎలక్ట్రానిక్స్) పోస్టులు 90 ఉండగా, సైంటిస్ట్/ఇంజినీర్ ఎస్సీ(మెకానిక్) 163, సైంటిస్ట్/ఇంజినీర్ ఎస్సీ(కంప్యూటర్ సైన్స్) 47, సైంటిస్ట్/ఇంజినీర్ఎస్సీ(ఎలక్ట్రానిక్స్)-అటానమస్ బాడీ-పీఆర్ఎల్ 2, సైంటిస్ట్/ఇంజినీర్ ఎస్సీ(కంప్యూటర్ సైన్స్)-అటానమస్ బాడీ-పీఆర్ఎల్ 01 చొప్పున పోస్టులను భర్తీ చేస్తారు.

విద్యార్హతలు:
కనీసం 65శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌లలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి:
2023, జూన్ 14 నాటికి 28 ఏళ్లు మించరాదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగులకు వయో సడలింపు ఉంటుంది.
ప్రారంభ వేతనం: నెలకు రూ. 56,100
దరఖాస్తు ఫీ: రూ. 250
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీ ఎప్పుడు నిర్వహించేది మాత్రం నోటిఫికేషన్‌లో పేర్కొనలేదు. ఇందుకు సంబంధించిన తేదీని దరఖాస్తు చేసుకున్న వారికి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది.
ఇస్రోలో పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://apps.ursc.gov.in/CentralBE-2023/advt.jsp












Click it and Unblock the Notifications