JEE Main 2024 Session 1 CutOff: జేఈఈ మెయిన్స్ కటాఫ్ ఇదేనా ? కేటగిరీల వారీగా..!
ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు ఈ నెలలో విడుదల కాబోతున్నాయి. ఫిబ్రవరి 12న ఈ ఫలితాలు విడుదల చేసేందుకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సిద్దమవుతోంది. అంతకు ముందే పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో పరీక్ష రాసిన అభ్యర్ధులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఫలితాల తర్వాత కటాఫ్ మార్కులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షకు గతేడాదితో పోలిస్తే 27 శాతం మంది ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది మొత్తం 12 లక్షల 31 వేల 874 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే పేపర్ 1కు దేశవ్యాప్తంగా 95.8 శాతం మంది హాజరయ్యారు. ఎన్టీఏ జేఈఈ పరీక్షలు నిర్వహించడం ప్రారంభించాక ఇదే అత్యధిక హాజరుశాతంగా నమోదైంది. మరోవైపు జేఈఈ పరీక్షలో మార్కుల కటాఫ్ ను రెండు రకాలుగా నిర్ణయిస్తారు.

ఇందులో ఒకటి క్వాలిఫయింగ్ కటాఫ్. దీన్ని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయిస్తుంది. అలాగే రెండవది అడ్మిషన్ కటాఫ్. దీన్ని అడ్మిషన్లు ఇచ్చేందుకు అందుబాటులో ఉన్న సంస్ధల తరఫున జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జేఓఎస్ఏఏ) నిర్ణయిస్తుంది. గత కొన్నేళ్లుగా నిర్ణయిస్తున్న కటాఫ్ ఆధారంగా ఈ ఏడాది ఎలా ఉండబోతోందనే అంశాన్ని నిపుణలు ఇలా అంచనా వేస్తున్నారు. ఇది కేటగిరీల వారీగా ఉంటుంది.
నిపుణుల అంచనా ప్రకారం జేఈఈ మెయిన్ 2024 కటాఫ్ జనరల్ కేటగిరీకి 90 ప్లస్ ఉండనుంది. ఓబీసీ-ఎన్సీఎల్ కేటగిరీకి 75 ప్లస్, ఈడబ్ల్యూఎస్ 78 ప్లస్, ఎస్సీలకు 44 ప్లస్, పీడబ్లూడీకి 0.11 ప్లస్ ఉంటుందని అంచనా. మరోవైపు త్వరలో జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల కోసం ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. విడుదల కాగానే అభ్యర్ధులు jeemain.nta.ac.in వెబ్ సైట్ నుంచి ఈ ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్ పీడీఎఫ్ ను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ తుది ఆన్సర్ కీని, ఫలితాలను విడుదల చేస్తుంది. ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 2 వరకూ ఇది కొనసాగనుంది. జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్ష రాయాలనుకునే వారు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్టీఏ అవకాశం కల్పిస్తోంది. ఏప్రిల్ లో సెషన్ 2 పరీక్ష నిర్వహిస్తారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications