JEE Main 2024 Application Correction: జేఈఈ అప్లికేషన్ల కరెక్షన్ విండో ఓపెన్-ఈ మార్పులకు..!

దేశవ్యాప్తంగా ఈ ఏడాది జరిగే జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. దీంతో ఇప్పటికే అభ్యర్ధులు సమర్పించిన దరఖాస్తుల్లో ఏవైనా మార్పులు చేర్పులు అవసరమైతే చేసుకునేందుకు వీలుగా జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ.. కరెక్షన్ విండోను ఇవాళ తెరుస్తోంది. మార్చి 4వ తేదీ వరకూ జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ మార్పులు చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది.

ఈ ఏడాది జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష రాసేందుకు అభ్యర్దులు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.ac.in లో దరఖాస్తులు సమర్పించారు. మార్చి4తో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. అయితే ఇందులో అభ్యర్ధులు ఏవైనా పొరబాట్లు చేస్తే సరిచేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇవాళ, రేపు ఈ అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్ చేసి ఉంచుతున్నారు. కాబట్టి రెండు రోజుల్లో అభ్యర్ధులు దరఖాస్తుల్లో పొరబాట్లు సరి చేసుకోవచ్చు.

JEE Main 2024 session 2 application correction window opens- here is list of changes allowed

కరెక్షన్ విండోలో జేఈఈ మెయిన్ 2024కు దరఖాస్తు చేసుకోని వారు కూడా తమ అప్లికేషన్లు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఇదే చివరి అవకాశమని ఎన్టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్ 2024 మొదటి సెషన్ జనవరి-ఫిబ్రవరిలో జరిగింది. అలాగే పేపర్ 1 ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. పేపర్ 2 ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఇప్పుడు సెషన్ 2 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తయ్యాక సెషన్ 2 పరీక్ష అడ్మిట్ కార్డుల విడుదల, కీ విడుదల, పరీక్ష తేదీ ప్రకటన చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+