JEE Main 2026 admit cards: జేఈఈ అడ్మిట్ కార్డులొచ్చేశాయ్..! డౌన్ లోడ్ ఇలా..!
ఈ ఏడాది ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్స్ 2026) సెషన్ 1 కోసం అడ్మిట్ కార్డుల్ని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ విడుదల చేసింది. ఇప్పటికే ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు వీటిని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి, లింక్, ఇతర వివరాలను ఎన్టీఏ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఈ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం..
ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ 2026 పరీక్షల్ని జనవరి 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో మొదటి నాలుగు రోజుల పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డుల్ని ఇవాళ విడుదల చేశారు. అంటే జనవరి 21, 22, 23, 24 తేదీల్లో జరిగే జేఈఈ మెయిన్ పేపర్ 1 కు సంబంధించిన అడ్మిట్ కార్డులు మాత్రమే విడుదలయ్యాయి. త్వరలో జనవరి 28, 29 తేదీల్లో జరిగే పేపర్ 2 పరీక్షల అడ్మిట్ కార్డుల్ని విడుదల చేస్తారు.

ఇవాళ విడుదల చేసిన పేపర్ 1 పరీక్ష అడ్మిట్ కార్డుల్ని వీటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు https://jeemain.nta.nic.in/ వెబ్ సైట్ లోకి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలను రెండు షిఫ్టులుగా నిర్వహించబోతున్నారు. ఇందులో మొదటి షిఫ్ట్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ ఉంటుంది. అలాగే రెండో షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ ఉంటుంది. ఎన్టీఏ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే అడ్మిట్ కార్డులు కనిపిస్తాయి. వాటిని అన్ని వివరాలు చెక్ చేసుకున్నాక ప్రింట్ తీసుకుని పరీక్ష కేంద్రాలకు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications