JEE Main admit card 2024: జేఈఈ మెయిన్ పేపర్ 1 అడ్మిట్ కార్డుల రిలీజ్..డౌన్ లోడ్ ఇలా..
జేఈఈ మెయిన్ పరీక్ష 2024 సెషన్ 1 కు సంబంధించిన పేపర్ 1 (బీఈ, బీటెక్ ) పరీక్ష అడ్మిట్ కార్డులు ఇవాళ విడుదలయ్యాయి. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)వీటిని విడుదల చేసింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గా పేర్కొనే జేఈఈ సెషన్ 1 పేపర్ 1 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 మధ్య జరగనున్నాయి. దీంతో ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు అడ్మిట్ కార్డులు విడుదల చేశారు.
JEE మెయిన్ 2024 పేపర్ 1 పరీక్షను జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీలలో దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షను రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. మొదటిది ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే రెండవది మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులు పేపర్ 1 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి ..అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని కలిగి ఉండాలి. అడ్మిట్ కార్డ్, డైరెక్ట్ లింక్, ఇతర వివరాలను ఎన్టీఏ వెల్లడించింది.

JEE మెయిన్ 2024 పేపర్ 1 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా ?
1. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ను ఓపెన్ చేయాలి.
2. హోమ్‌పేజీలో JEE మెయిన్ 2024 అడ్మిట్ కార్డ్ (లింక్ యాక్టివ్ అయిన తర్వాత) అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి.
3. స్క్రీన్‌పై కొత్త పేజీ కనిపిస్తుంది.
4. అడిగిన ఆధారాలను నమోదు చేసి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
5. అనంతరం అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
6. ఇక్కడ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.
మరిన్ని అప్‌డేట్‌ల కోసం, అభ్యర్థులు JEE మెయిన్స్ 2024 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
జేఈఈ మెయిన్ 2024 సెషన్ పరీక్ష జనవరి 24న బీఆర్క్, బీప్లానింగ్ పేపర్ తో మొదలైంది. అనంతరం బీఈ, బీటెక్ పేపర్లకు జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. JEE (మెయిన్) 2024 పరీక్షను మొత్తం 13 భాషలలో నిర్వహిస్తున్నారు. ఇందులో ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ ఉన్నాయి. అభ్యర్ధులు ఎంచుకున్న మీడియం ఆధారంగా పరీక్షా పత్రాలు అందిస్తారు.












Click it and Unblock the Notifications