జెఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

జేఈఈ మెయిన్స్‌ పరీక్ష అడ్మిట్ కార్డులు ఏప్రిల్ 1, 2024 సోమ‌వారం విడుద‌లయ్యాయి. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్రప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ క‌ళాశాల‌ల్లో ప్రవేశాలు పొందగ‌లిగేందుకు ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఈ ప‌రీక్ష రెండుసార్లు ఉంటుంది. ఈ ప‌రీక్ష ఎన్‌టిఎ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతుంది. జేఈఈ మెయిన్స్ 2024 సెషన్-2 అడ్మిట్‌ కార్డులు సోమవారం విడుద‌ల‌య్యాయి.

విద్యార్ధుల కోసం దేశ‌వ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్ మెయిన్స్‌ను నిర్వ‌హిస్తారు. ప్ర‌తిష్ఠాత్మక విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్‌ స్కోరే ప్రామాణికం. ఇక ఈ పరీక్షకు అప్ల‌య్‌ చేసుకున్న అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.ac.in/ లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, కోర్సు, సెక్యూరిటీ పిన్ వంటి వివ‌రాల‌ను నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్ సెషన్‌-2 (JEE Mains Session 2) పరీక్షలు ఏప్రిల్‌ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. తెలుగుతోపాటు మొత్తం 13 ప్రధాన భాషల్లో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష జరుగుతుంది. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో సుమారు 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు పంపిస్తారు. ప్రవేశాలకు ఇందులో సాధించిన ర్యాంకులనే ప్రామాణికంగా తీసుకుంటారు.

JEE Mains Admit Cards Released Download Here

ఏప్రిల్ 25న ఫ‌లితాలు విడుద‌ల‌..

ఇచ్చిన ప‌రీక్ష‌ల తేదీ ప్ర‌కారం.. మొత్తం రెండు సెష‌న్‌లో ప‌రీక్ష ఉండ‌నుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం మూడు గంట‌ల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండోసెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీన‌ బీఆర్క్ పేపర్-2ఎ పరీక్ష‌, పేపర్-2బి బీప్లానింగ్ లేదా పేపర్-2ఎ, 2బి రెండూ రాసే అభ్యర్థులకు పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. ఇక‌, ఆ రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒకే సెషన్‌లో పరీక్ష జ‌రుగుతుంది. జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఏప్రిల్ 25న విడుద‌ల కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+