Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెంట్రల్ బ్యాంక్​ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. 484​ పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌... సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 484 స‌ఫాయి కర్మచారి/ సబ్​-స్టాఫ్​ పోస్టుల భర్తీకి అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది. ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్- దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు ఈ నెల 27వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్ల‌య్ చేసుకోగ‌ల‌రు. ఈ ఉద్యోగాల‌కు అప్ల‌య్ చేసుకోవాల‌నుకునేవారు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. అర్హ‌త‌, ఆసక్తి క‌లిగిన అభ్య‌ర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇత‌ర పూర్తి వివ‌రాలు..

ఈ పోస్టుల‌కు అప్ల‌య్ చేసుకోవాల‌నుకునేవారు 31.03.2023 నాటికి 18 - 26 ఏళ్ల మధ్య వ‌య‌స్కులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వ‌యోప‌రిమితి వ‌ర్తిస్తుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు రూ. దరఖాస్తు రూ.850 ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులయితే రూ.175 చెల్లించాలి. ఈ ఉద్యోగాలు పొందిన‌వారికి నెల‌కు వేత‌నం రూ. 19,500 - రూ.37,815గా ఉంటుంది.

Jobs in Central Bank of India Notification for 484 posts

సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్: 484 పోస్టులు

జోన్ల వారీగా ఖాళీలున్న పోస్టులివే..

అహ్మదాబాద్- 76
భోపాల్- 38,
దిల్లీ- 76,
కోల్‌కతా- 2,
లఖ్‌నవూ- 78,
ఎంఎంజడ్‌వో & పుణె- 118,
పాట్నా- 96

ఉద్యోగాల‌కు ఎంపిక చేయు విధానం..

ఆన్‌లైన్ పరీక్ష(70 మార్కులు), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్(30 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాల‌కు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష ఇంగ్లీషు మీడియంలో ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో ఈ ప‌రీక్ష‌ను నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ అరిథ్‌మెటిక్‌, సైకోమెట్రిక్ టెస్ట్(రీజనింగ్) అంశాల నుంచి ప్రశ్నలు వ‌స్తాయి.

ముఖ్యమైన తేదీలివే..

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం : 21.06.2024.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 27-06-2024

ప్రీ ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ ఎగ్జామ్‌ కాల్ లెటర్‌ డౌన్‌లోడ్: జులై 2024.

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: జులై 2024.

ఆన్‌లైన్ పరీక్ష కాల్ లెటర్‌ డౌన్‌లోడ్: జులై/ ఆగస్టు 2024.

ఆన్‌లైన్ పరీక్ష: జులై/ ఆగస్టు 2024.

పరీక్ష ఫలితాల వెల్లడి: ఆగస్టు 2024.

లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ కాల్ లెటర్‌ డౌన్‌లోడ్‌: సెప్టెంబర్‌ 2024.

లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ (జోన్ల వారీగా): సెప్టెంబర్‌ 2024.

ప్రొవిజనల్‌ సెలెక్షన్‌: అక్టోబర్‌ 2024.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+