ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు.. మే 22 దరఖాస్తుకు చివరితేది..
ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా ఓ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1074 ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో భారీ ఉద్యోగాలు. ఇందులోఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌మీడియట్ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. మే 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకోసం ఈ కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి. https://igiaviationdelhi.com/igi-avaiation-job-application-important-instructions/

ఇతర వివరాలు ఇలా ఉన్నాయి...
ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ (సీఎస్‌ఏ) మొత్తం పోస్టులు : 1,074
విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్రెషర్స్, ఇంటర్/12వ తరగతి ఫలితాల కోసం
ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు.
వయసు : 18 - 30 ఏళ్ల మధ్య ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
వేతనం : ఈ ఉద్యోగాలకు ఎంపికయిన వారికి నెలకు రూ.25,000 నుంచి రూ.35,000గా వేతనంగా నిర్ణయించారు.
ఉద్యోగాలకు ఎంపిక చేయు విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులకు
ఎంపిక చేస్తారు.
మే 22, 2024 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదిగా నిర్ణయించారు.
పరీక్ష ఫీజు: ఈ పోస్టులకు అప్లయ్ చేయాలనుకునే అభ్యర్థులకు రూ.350 పరీక్ష ఫీజుగా నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఆన్‌లైన్
విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications