ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు..146 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులు..
నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 146 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇందులో చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసేందుకు ఏప్రిల్ 1. 2024 దరఖాస్తులకు చివరితేదిగా నిర్ణయించడమైనది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు పూర్తి https://www.indianbank.in/ ఈ వెబ్‌సైట్ ను సందర్శించగలరు. అలాగే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు నేరుగా ఈ లింక్ https://ibpsonline.ibps.in/ibsofebr24/ ను క్లిక్ చేయగలరు.
మొత్తం పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య : 146
చీఫ్ మేనేజర్
సీనియర్ మేనేజర్
అసిస్టెంట్ మేనేజర్
మేనేజర్
ఆయా విభాగాల్లో ఖాళీల వివరాలు..

క్రెడిట్, ఎన్‌ఆర్ బిజినెస్ రిలేషన్‌షిప్, సెక్యూరిటీ, ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్, డిజిటల్ మార్కెటింగ్, ఎస్‌ఈవో అండ్ వెబ్‌సైట్ స్పెషలిస్ట్, సోషల్ మీడియా స్పెషలిస్ట్, క్రియేటివ్స్ ఎక్స్‌పర్ట్, ఫారెక్స్/ ట్రేడ్ ఫైనాన్స్, ట్రెజరీ డీలర్, ట్రేడింగ్/ ఆర్బిట్రేజ్ ఇన్ కరెన్సీ ఫ్యూచర్స్, ట్రేడింగ్ ఇన్ ఇంటర్‌బ్యాంక్, ఈక్విటీ డీలర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత : సంబంధిత విభాగంలో సీఏ/ సీడబ్ల్యూఏ/ ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి.
ఈ పోస్టులకు ఎంపిక చేయు విధానం : దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష/ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు రుసుము : ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకునేందుకు దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.1000గా నిర్ణయించారు. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175గా నిర్ణయించారు. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు ఏప్రిల్ 1, 2024, చివరి తేదీగా పరిగణించడమైనది.












Click it and Unblock the Notifications