Navodaya Schools: నవోదయ స్కూల్స్ పరీక్షలపై అప్‌డేట్.. తేదీల్లో కీలక మార్పు
Education News: దేశీయ విద్యావిధానంలో ఇటీవల కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విద్య అవసరాన్ని గుర్తెరిగిన తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని తాపత్రయపడుతున్నారు. పలు పోటీ పరీక్షలకు చిన్ననాటి నుంచే సన్నద్ధం చేస్తున్నారు. పాఠశాల విద్య సమయంలోనే నవోదయ విద్యాలయ సమితి వంటి పరీక్షలు రాయిస్తున్నారు. దేశ వ్యాప్తంగా జరిగే ఈ పరీక్షలు ఒక రకంగా విద్యార్థులకు మొదటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌గా చెప్పవచ్చు. వీటిపై తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది.
జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025 ఏడాదికిగాను ఆరవ తరగతిలోకి ప్రవేశ పరీక్ష (JNVST-2025) నమోదు తేదీని పొడిగిస్తూ నవోదయ విద్యాలయ సమితి (NVS) నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 7, 2024 చివరి తేదీగా పేర్కొంది. ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థుల తల్లిదండ్రులు మరియు సంరక్షకులు NVS అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inలోని డైరెక్ట్ లింక్ ద్వారా అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. లేదా cbseitms.rcil.gov.inను వినియోగించుకోవాలని సూచించింది.

'2025-26 విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశానికి జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రెస్‌లో ఉంది. పరిపాలనా కారణాల వల్ల ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించే చివరి తేదీ 07.10.2024 వరకు పొడిగించబడింది. అభ్యర్థులు NVS వెబ్‌సైట్ https://navodaya.gov.in/ లేదా https://cbseitms.rcilని సందర్శించడం ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు' అని అధికారిక నోటీసులో పేర్కొంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఏవైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకునేందుకు వెబ్‌సైట్‌లో కరెక్షన్ విండో ఓపెన్ కానుంది. అధికారిక నోటీసు ప్రకారం లింగం, కేటగిరీ (జనరల్/ OBC/ SC/ ST), ప్రాంతం (గ్రామీణ/పట్టణ), వైకల్యం మరియు పరీక్షా మాధ్యమాలకు సంబంధించి సవరణలు చేయవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ చివరి తేదీ ముగిసిన రెండు రోజుల తర్వాత ఇందుకు అవకాశం లభించనుంది.
దరఖాస్తు చేసేందుకు NVS అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inను సందర్శించి హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న JNVST క్లాస్ 6 అడ్మిషన్ 2025 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. విద్యార్థి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే నమోదు పూర్తవుతుంది. అనంతరం ఖాతాలో లాగిన్ అయ్యి దరఖాస్తు ఫారమ్ పూరించి, రుసుము చెల్లించాలి. సబ్మిట్ చేసిన అనంతరం ఫారమ్ డౌన్‌లోడ్ చేసి తదుపరి అవసరాల కోసం హార్డ్ కాపీని భద్రపరచుకోవాలి.












Click it and Unblock the Notifications