కేవీ స్కూల్ అడ్మిష‌న్ అప్లికేషన్ స్టేటస్ వ‌చ్చేసింది... ఇలా చెక్ చేసుకోండి..

కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేష‌న్ వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా కేవీల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 1వ తేది నుంచి 15 వ తేది వరకు దరఖాస్తులు స్వీకరించిన విష‌యం తెలిసిందే. ఇక‌, కేవీలో ఒక‌టో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు లాటరీ ప్రక్రియ ద్వారా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా 'అప్లికేషన్ స్టేటస్' ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కేంద్రీయ విద్యాలయాల్లో 1 వ త‌ర‌గ‌తి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాల కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) మార్చి నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందే చిన్నారుల వయసు 31.03.2024 నాటికి 6 సంవత్సరాలు పూర్తికావాల్సి ఉంటుంది. కేవీ స్కూళ్ల‌ల్లో 11వ తరగతి ప్ర‌వేశాల‌కు మినహా మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్లకు జూన్ 29 లాస్ట్‌డేట్‌గా నిర్ణయించారు.

KV School Admission Application Status has arrived Check this

ఇలా చెక్ చేసుకోవాలి..

ఇక‌, ఒక‌టో త‌ర‌గ‌తి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు లాగిన్ వివరాలు నమోదుచేసి త‌మ అప్లికేష‌న్ స్టేట‌స్‌ను చెక్ చేసుకోవ‌చ్చు. ఎంపిక చేసుకున్న ఏదైనా మూడు కేవీల్లో తమ లాటరీ నంబర్‌తోపాటు పాఠశాలల వారీగా వెయిటింగ్ లిస్ట్ వివరాలను ఇందులో చెక్ చేసుకోవచ్చు. ఇక‌, ఇందులో వ‌చ్చే వివరాలు లాటరీ తర్వాత వారి అప్లికేషన్‌ స్టేటస్‌కు సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటుంద‌ని, పాఠశాలల్లో ప్రవేశాలకు ఇది ఎంత మాత్రం నిర్ధారణ కాదని కేంద్రీయ విద్యాలయ సంగతన్ వివ‌రించింది. స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్ అనంత‌రం నిర్ణయించిన విధివిధానాల ప్రకారం దరఖాస్తుదారుల అడ్మిషన్ స్టేటస్‌ను సంబంధిత పాఠశాలలు నిర్ణయిస్తాయి. అయితే కేవీ స్కూల్ ప్ర‌వేశాల తుది ఎంపిక జాబితాలు, ఇతర వివరాల కోసం సంబంధిత పాఠశాలలను మాత్ర‌మే సంప్రదించాల్సి ఉంటుంది.

అప్లికేషన్ స్టేటస్‌ కోసం ఈ లింక్‌పై https://kvsonlineadmission.kvs.gov.in/login.html క్లిక్ చేయండి..

ముఖ్యమైన తేదీలు...

కేవీ స్కూల్లో ప్ర‌వేశాల ఎంపిక జాబితా వెల్లడి తేదీలు : 19.04.2024 (లిస్ట్-1),
29.04.2024 (లిస్ట్-2), 08.05.2024(లిస్ట్-3).

సెకండ్ నోటిఫికేషన్ (ఎక్స్‌టెండెడ్ తేదీ):

నోటిఫికేషన్-2 (ఎక్స్‌టెండెడ్): 07.05.2024

రిజిస్ట్రేషన్: 08.05.2024- 15.05.2024

ఎంపికజాబితా వెల్లడి: 22.05.2024 - 27.05.2024.

2వ త‌ర‌గ‌తి, ఆపై తరగతులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం : 01.04.2024 - 10.04.2024.

ఎంపిక జాబితా వెల్లడి: 15.04.2024.

ప్రవేశాలు: 16.04.2024- 29.04.2024.

ప్రవేశాలు పొందడానికి చివరితేది: 29.06.2024

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+