వర్షాలతో సెలవులు: రెండు పరీక్షలను వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ, పలు పరీక్షల తేదీలు ఖరారు
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రేపు(శుక్రవారం) జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెల్లడించింది. భూగర్భజల విభాగం పోస్టులకు సంబంధించి శుక్రవారం జరగాల్సిన ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలను వాయిదా వేస్తూ టీఎస్‌పీఎస్సీ గురువారం ప్రకటన విడుదల చేసింది.
పలు పరీక్షల తేదీలు ఖరారు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023లో జరగనున్న వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం కొత్త పరీక్ష తేదీలను విడుదల చేసింది. గతంలో పేపర్ లీక్ కారణంతో గత మార్చి 5న పరీక్షలు రద్దైన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ తాజా ప్రకటన విడుదల చేసింది. ఇంతకుముందు వాయిదా వేసిన వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం టీఎస్‌పీఎస్సీ ఇప్పుడు కొత్త పరీక్ష తేదీలను విడుదల చేసింది.
ఇందులో భాగంగా ఏఈ తో పాటు మున్సిపల్ ఏఈ, అలాగే.. టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ అధికారి పరీక్ష నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది. టీఎస్పీఎస్సీ. అక్టోబర్ 28,19న సివిల్ ఇంజినీరింగ్ పరీక్ష, 20న మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పరీక్ష జరగనున్నట్టు కమషన్ ప్రకటించింది. పలు ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం సెప్టెంబర్ 12న నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ జారీ చేసింది.
టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త తేదీలు విడుదల చేశారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం కోసం TSPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. పరీక్షల షెడ్యూల్‌లో ఏవైనా మార్పుల కోసం క్రమం తప్పకుండా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వాల్సిందిగా అభ్యర్థులందరికీ కమిషన్ సూచించింది.












Click it and Unblock the Notifications