పాలిటెక్నిక్ లెక్చరర్స్ నియామక పరీక్షల తేదీల్లో మార్పులు: మళ్లీ ఎప్పుడంటే?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) మే నెలలో నిర్వహించనున్న పాలిటెక్నిక్ లెక్చరర్స్ నియామక పరీక్ష తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మే 13న జరగాల్సిన పాలిటెక్నిక్ లెక్చరర్స్ నియామక పరీక్షలను సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు రీషెడ్యూల్ చేసినట్లు కమిషన్ తెలిపింది.

మరోవైపు, మే నెల 17న ఇంటర్ విద్య, సాంకేతిక విద్యా శాఖల్లో ఫిజికల్ డైరెక్టర్ల నియామక పరీక్ష జరగాల్సి ఉంది. ఈ పరీక్షను సెప్టెంబర్ 11వ తేదీకి రీషెడ్యూల్ చేసినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. కాగా, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ 247 పాలిటెక్నిక్ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గతంలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Lecturers recruitment

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో తాజాగా, మరో ఇద్దరు అరెస్టయ్యారు. దీంతో ఈ కేసులో అరెస్టైన నిందితుల సంఖ్య 22కు చేరింది. వికారాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్ కుమార్.. డాక్య నుంచి ఏఈ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. భగవంత్ కుమార్ తన తమ్ముడు రవికుమార్ కోసం ఏఈ పేపర్ కొన్నట్లు దర్యాప్తులో తేలింది. రవికుమార్ ఏఈ ఎగ్జామ్ రాశాడు. దీంతో పోలీసులు భగవంత్ కుమార్, రవికుమార్ ఇద్దరినీ సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.

కాగా, భగవంత్ కుమార్‌కు పేపర్ అమ్మకానికి డాక్య నాయక్ రూ. 2 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సిట్ అధికారులు డాక్యా నాయక్ బ్యాంక్ లావాదేవీలు పరిశీలించారు. అనుమానాస్పస్పద లావాదేవీగా 1.75 లక్షలను సిట్ గుర్తించింది. ఈ మొత్తం సొమ్ము భగవంత్ కుమార్ నుంచి డిపాజిట్ అయినట్టు సిట్ గుర్తించింది. దీనిపై సిట్‌ అధికారులు భగవంత్ రావ్‌ను విచారించగా తన తమ్ముడు రవికుమార్ కోసం పేపర్ కొన్నట్టు అంగీకరించాడు. దీంతో పేపర్ లీక్ నిందితుల సంఖ్య 22కు చేరింది.

అయితే, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌ వ్యవహారం మార్చి 12న వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రూప్‌-1 తోపాటు పలు పరీక్షలను కమిషన్‌ రద్దు చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో నిందితులకు రూ.33.4 లక్షలు అందినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. మరోవైపు, ఈడీ కూడా ఆర్థిక లావాదేవీలపై విచారణ జరుపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+