మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు: అప్లై చేయండి, రూ. 50వేలపైనే జీతం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హాస్పిటల్ ఆడ్మినిస్ట్రేషన్, న్యూరాలజీ, ఆప్తమాలజీ, పీడియాట్రిక్స్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహబిలిటేషన్, ట్రామా ఎమర్జెన్సీ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టులకు సంబంధించిన ముఖ్య విషయాలు:
మెడికల్ కౌన్సిల్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్/మెడిసిన్/పీడియాట్రిక్స్/ఆప్తమాలజీ/ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహబిలిటేషన్ లేదా తత్సమాన స్పెషలైజేషన్లో ఎంబీ/డీఎన్బీ/సర్జరీలో ఎంఎస్/ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

వయో పరిమితి: అభ్యర్ధుల వయస్సు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 29, 2022వ తేదీన ఉదయం 8 గంటల 30 నిముషాలకు సంబంధిత డాక్యుమెంట్లతో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు.
ఫీజు వివరాలు:
ఇంటర్వ్యూ సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.800లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
జీతం వివరాలు:
ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఈ నోటిపికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications