NEET SS 2023: నీట్ ఎస్ఎస్ 2023 అభ్యర్ధులకు గుడ్ న్యూస్- కౌన్సెలింగ్ రిపోర్టింగ్ తేదీ పొడిగింపు..

గతేడాది జాతీయ స్ధాయిలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ సూపర్ స్పెషాలిటీ (NEET SS) 2023 కౌన్సెలింగ్ రౌండ్ 2 కోసం రిపోర్టింగ్ తేదీని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ పొడిగించింది. అభ్యర్ధుల నుంచి వస్తున్న వినతుల మేరకు డిసెంబర్ 31తో ముగిసిన ఈ తేదీని కాస్తా జనవరి 5 వరకు పొడిగించింది. తమకు కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లకు రిపోర్ట్ చేయాలనుకునే అభ్యర్థులు mcc.nic.inలో దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు.

నీట్ సూపర్ స్పెషాలిటీ 2023 అభ్యర్థుల నుండి వచ్చిన అనేక అభ్యర్ధనలపై ఇవాళ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) స్పందించింది. SS కౌన్సెలింగ్ రౌండ్ 2 రిపోర్టింగ్ తేదీని పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. కమిటీ తమ అధికారిక ప్రకటనలో "SS కౌన్సెలింగ్ రౌండ్ 2 కోసం రిపోర్టింగ్ పొడిగింపు కోసం ఎంసీసీకి చాలా వినతులు వచ్చాయని తెలిపింది. అభ్యర్థులు ఇందుకు చూపిన కారణాలను పరిగణనలోకి తీసుకుని జనవరి 5, 2024న సాయంత్రం 6 గంటల వరకు రిపోర్టింగ్ తేదీ పొడిగింపును మంజూరు చేసినట్లు తెలిపింది.

NEET SS 2023 Counselling: Round 2 reporting date extended to January 5

అలాగే అభ్యర్ధులు తాము ఎంచుకున్న కాలేజీల్లో రిపోర్టింగ్ సమయంలో తప్పనిసరిగా తాము నిర్దేశించిన పత్రాలను తమతో పాటు తీసుకు వెళ్లాలని కమిటీ ఈ ప్రకటనలో సూచించింది. వీటిలో ఎంసీసీ నుండి తాత్కాలిక కేటాయింపు లేఖ, ఎన్బీఈ జారీ చేసిన అడ్మిట్ కార్డ్, ఎన్బీఈ రిజల్ట్ లేదా ర్యాంక్ లేఖ, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికెట్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్, సంబంధిత స్పెషాలిటీలో ఎండీ, ఎమ్మెస్, డీఎన్బీ డిగ్రీ సర్టిఫికేట్, ఎంసీఐ, లేదా ఎన్బీఐ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ జారీ చేసిన ఎంబీబీఎస్, ఎంఎస్ లేదా డీఎన్బీ కోసం శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచిస్తోంది.

సెప్టెంబర్ 30, 2023లోగా పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రొవిజనల్ సర్టిఫికెట్‌తో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కమిటీ తెలిపింది. హైస్కూల్ లేదా హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్లు లేదా పుట్టిన తేదీకి సాక్ష్యంగా పుట్టిన సర్టిఫికేట్.పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా ఆధార్ కార్డ్ వంటి చెల్లుబాటు అయ్యే ఐడీలు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+