నీట్ యూజీ 2024 ఆన్సర్ కీ విడుదల..
నీట్ యూజీ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలయ్యింది. పరీక్ష అభ్యర్థుల సమాధానాలతో పాటు ప్రొవిజనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరయిన అభ్యర్థులు తమ ప్రొవిజనల్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోగలరు. అందుకోసం అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ను exams.nta.ac.in/NEET సంప్రదించగలరు. నీట్ యూజీ 2024 పరీక్ష ఈ నెల 5వ తేదిన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఈ పరీక్షకు మొత్తం 24 లక్షల మంది హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న 571 నగరాలు, భారతదేశం వెలుపల 14 నగరాల్లో ఉన్న 4,750 కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహించారు.
అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్లు, పుట్టిన తేదీల వివరాలతో ప్రొవిజనల్ ఆన్సర్ కీ, సమాధానాలను డౌన్లోడ్ చేసుకోగలరు. అందుకోసం నీట్ యూజీ అధికారికి వెబ్‌సైట్‌ను సంప్రదించండి. నీట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ, సమాధానాలకు ఫీడ్ బ్యాక్ పంపేందుకు కూడా ఎన్‌టిఎ అవకాశం కల్పించింది. ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు రీఫండ్ కాదు. ఈవిషయాన్ని అభ్యర్థులు గమనంలో ఉంచుకోవాలి.

మార్చి 31 రాత్రి 11.50 గంటల వరకు మీ అభ్యంతరాలను తెలియజేయొచ్చు. ఆఫ్లైన్ లేదా మరే ఇతర పద్ధతి ద్వారా చేసే సవాళ్లను అంగీకరించబోమని ఎన్‌టిఎ స్పష్టం చేసింది. . నీట్ యూజీ ఫలితాలను ఫైనల్/రివైజ్డ్ ఆన్సర్ కీని ఉపయోగించి తయారు చేయడం జరుగుతంది. ఫైనల్ కీపై ఎటువంటి అభ్యంతరాలను స్వీకరించడం జరగదు. అభ్యర్థులు ప్రొవిజనల్ కీ కోసం exams.nta.ac.in.ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.












Click it and Unblock the Notifications