NEET UG 2024 Paper Leak: నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందా ? ఎన్డీయే ఏమంటోంది..?

వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిన్న జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష విజయవంతంగా ముగిసింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 557 నగరాలు, విదేశాల్లోని 14 పరీక్ష కేంద్రాల్లో సైతం నీట్ పరీక్ష జరిగింది. దీనికి లక్షలో సంఖ్యలో అభ్యర్ధులు హాజరయ్యారు. అయితే ఈ పరీక్ష ముగియకముందే సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైంది.

నిన్న దేశ, విదేశాల్లోని పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 వరకూ నీట్ యూజీ పరీక్ష జరిగింది. అయితే నీట్ పరీక్షా పత్రం మాత్రం పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో సాయంత్రం 4 గంటలకే కనిపించింది. దీంతో నీట్ పేపర్ లీక్ వార్తలు గుప్పుమన్నాయి. ముఖ్యంగా టెలిగ్రామ్ గ్రూపుల్లో కనిపించిన నీట్ ప్రశ్నాపత్రాన్ని 4 గంటలకే చాలా మంది షేర్ చేశారు. దీంతో పేపర్ లీకేజ్ పై పరీక్ష పూర్తి చేసుకుని బయటికి వచ్చిన అభ్యర్ధుల్లో ఆందోళన మొదలైంది.

NEET UG 2024 Question Paper Leaked NTA clarified to aspirants concerns

గతంలోనూ 2021లో ఇలాగే నీట్ పేపర్ లీక్ కావడంతో అభ్యర్ధులకు చుక్కలు కనిపించాయి. అప్పట్లో ఈ వ్యవహారంలో 8 మందిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. దీంతో ఈసారి కూడా ప్రశ్నాపత్రం ముందుగానే బయటికి రావడంతో లీక్ వార్తలు గుప్పుమన్నాయి. సోషల్ మీడియాలో ఊహాగానాలతో ఆందోళన చెందుతున్న నీట్ రాసిన అభ్యర్ధులు.. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీని హెల్ప్ లైన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఎన్డీయే జాతీయ మీడియా సంస్థకు ఈ లీక్ వార్తలపై వివరణ ఇచ్చింది.

నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వార్తల్ని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఖండించింది. ఇవి కేవలం సంచలనం కోసం రేపుతున్న పుకార్లే అని తేల్చేసింది. సవాయ్ మాధోపూర్ లో హిందీ మీడియం అభ్యర్ధులకు ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇచ్చారని, దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు అభ్యర్ధులు బలవంతంగా పరీక్ష కేంద్రం బయటికి వెళ్లిపోయారని, వీరి నుంచి టెలిగ్రామ్ ఛానళ్లలో లీక్ అయి ఉండొచ్చని అధికారులు తెలిపారు. అయితే అప్పటికే నీట్ పరీక్ష రాయాల్సిన అభ్యర్ధులంతా పరీక్ష కేంద్రాల్లోనే ఉన్నారని, ఈ ప్రశ్నాపత్రం బయటికి వచ్చినా ఆ ప్రభావం వారిపై లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+