NHAIలో మంచి జీతంతో మేనేజర్ స్థాయి ఉద్యోగాలు..పరీక్ష లేకుండానే - అర్హతలు ఇవే..!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియాలో తాజాగా ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 41 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు అర్హులైన అభ్యర్థులు 28 మే 2021లోగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆఫ్ లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
నేషనల్ హైవేస్ అథారిటీస్‌లో డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అర్హత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత. ఇక అప్లయ్ చేసుకునే అభ్యర్థులకు గరిష్టంగా 30 ఏళ్ల వయస్సు ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ పీహెచ్ అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారానే అప్లయ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అంటే ఏప్రిల్ 30వ తేదీనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 2021 మే 28వ తేదీ.

దరఖాస్తుకు సంబంధించిన ఫీజు తెలుసుకోవాలంటే అభ్యర్థులు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు.కేవలం అభ్యర్థుల దరఖాస్తులు మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. డిప్యూటీ మేనేజర్ వేతనం నెలకు రూ. 56100- 177500 to 78800-209200/- వరకు ఉంటుంది. వేతనంకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు. ఒక వేళ అభ్యర్థులు ఉద్యోగానికి ఎంపిక అయితే ఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://nhai.gov.in/
పూర్తి చేసిన దరఖాస్తులను ఈ కింది చిరునామాకు 28 మే 2021 లోపు పంపాల్సి ఉంటుంది.
GM (HR &Admn.)-I A,
National Highways Authority of India,
Plot No: G - 5&6, Sector - 10, Dwarka,
New Delhi - 110075.












Click it and Unblock the Notifications