NLC India Ltdలో ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులు: అర్హతలు ఇవే..!!
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 56 ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఏడాది కాలం పాటు శిక్షణ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 22 నవంబర్ 2021.
ఇక ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులకు గరిష్ట వయస్సు 28ఏళ్లు. ప్రభుత్వం సూచించిన రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఇంటర్మీడియెట్ తత్సమాన పరీక్ష అయిన ఛాటర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ పరీక్షలు 2020 మరియు 2021లో పాసైన అభ్యర్థులు మాత్రమే ఇందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఏడాది కాలం పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో స్టయిపెండ్ కింద నెలకు రూ.22వేలు చెల్లించడం జరుగుతుంది. సీఏ/సీఎంఎస్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు ఎలాంటి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.

సంస్థ పేరు: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: ఇండస్ట్రియల్ ట్రైనీ
పోస్టుల సంఖ్య:56
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 22 నవంబర్ 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సీఏ/సీఎంఎస్
వయస్సు: గరిష్ట వయస్సు 28 ఏళ్లు, ప్రభుత్వ రిజర్వేషన్ల ప్రకారం మినహాయింపు
ఎంపిక ప్రక్రియ: సీఏ/సీఎంఎస్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా
వేతనం: నెలకు రూ.22000/- స్టయిపెండ్ కింద చెల్లిస్తారు
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు ఎలాంటి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన పనిలేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 1 నవంబర్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 22 నవంబర్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.nlcindia.in/new_website/index.htm












Click it and Unblock the Notifications