డిగ్రీ లేకపోయినా ఉద్యోగమిస్తా..! జోహో శ్రీధర్ వెంబూ సంచలన ఆఫర్..!
మన దేశంలో ఉద్యోగం ఇవ్వాలంటే.. డిగ్రీలున్నా నైపుణ్యాలు కావాలి, అనుభవం కావాలి, రికమండేషన్లు కావాలంటూ నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు పెరిగిపోతున్నాయి. ఇచ్చిన ఉద్యోగం కూడా ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు. ఏఐ పేరుతోనే కాస్ట్ కటింగ్ పేరుతోనూ ఆ ఉద్యోగం ఎప్పుడు తీసేస్తారో తెలియదు. తిరిగి మళ్లీ రోడ్డుపైకి రావాల్సిందే. ఇలాంటి పరిస్ధితుల్లో డిగ్రీ లేకపోయినా ఉద్యోగం ఇస్తానంటూ ఓ కంపెనీ ఆఫర్ చేస్తోంది. దాని పేరే జోహో..
ఇంజనీరింగ్ డిగ్రీల కోసం జేఈఈ పరీక్షలు రాసి ఎక్కడ లేని ఒత్తిడి ఎదుర్కొంటున్న విద్యార్ధులకు ఊరటనిచ్చేలా జోహో సీఈవో శ్రీధర్ వెంబూ ఓ సంచలన ఆఫర్ ఇచ్చారు. మీ డిగ్రీతో నాకు సంబంధం లేదు.. నాకు కావాల్సిన నైపుణ్యం మీ దగ్గర ఉంటే చాలంటున్నారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలపై చదువులు, డిగ్రీల కోసం ఒత్తిడి పెట్టడం మానేయాలని ఆయన కోరుతున్నారు. తమిళనాడులోని తెన్ కాశీ నుంచే తన కంపెనీ నడుపుతున్న శ్రీధర్ వెంబూ తాజాగా ఓ ఉదాహరణ ఇచ్చారు.

అమెరికాకు చెందిన పలాంటీర్ అనే సంస్థ తాజాగా హైస్కూల్ విద్యార్ధుల్ని సంప్రదాయ కాలేజీ చదువుల్ని వదిలిపెట్టి తమతో కలిసి టెక్నాలజీ, జాతీయ భద్రతా ప్రాజెక్టులపై పనిచేసేందుకు తాజాగా ఆహ్వానించింది. దీంతో 500 మంది టీనేజర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 22 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అలాగే కొందరు ఐవీ లీగ్ అడ్మిషన్లను, స్కాలర్‌షిప్‌లను కూడా తిరస్కరించారు. దీన్ని ప్రస్తావిస్తూ శ్రీధర్ వెంబూ.. డిగ్రీ లేకుండా ఉద్యోగం కోరుకునే యువతలో వచ్చిన మార్పును ప్రశంసించారు.

Smart American students now skip going to college and forward-thinking employers are enabling them. This is going to be a profound cultural shift. This is the real "youth power", enabling young men and women to stand on their own feet, without having to incur heavy debt to get a… https://t.co/qrtuWnCx5n
— Sridhar Vembu (@svembu) December 3, 2025
తెలివైన అమెరికన్ విద్యార్థులు ఇప్పుడు కళాశాలకు వెళ్లడం మానేస్తున్నారు, భవిష్యత్తును ఆలోచించే యజమానులు వారిని ఉద్యోగాలకు అనుమతిస్తున్నారంటూ శ్రీధర్ వెంబూ తెలిపారు. ఇది యువత, మహిళలు డిగ్రీ పొందడానికి, ఖర్చుల కోసం భారీ అప్పులు చేయకుండా సొంత కాళ్ళపై నిలబడటానికి వీలు కల్పిస్తుందని తెలిపారు. ఈ పరిణామాలను గమనించాలని ముఖ్యంగా భారతీయ తల్లిదండ్రులు , కంపెనీలను శ్రీధర్ కోరారు. తమ జోహోలో ఏ ఉద్యోగానికీ కళాశాల డిగ్రీ అవసరం లేదని, ఎవరైనా మేనేజర్ డిగ్రీ అవసరమయ్యే ఉద్యోగాన్ని పోస్ట్ చేస్తే, డిగ్రీ అవసరాన్ని తీసేయమని హెచ్ఆర్ నుంచి మర్యాదపూర్వకంగా మెసేజ్ పంపుతున్నట్లు తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications