3,588 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్.. DON'T MISS !

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఒక అద్భుత అవకాశం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 3,588 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో పురుషులకు 3,406, మహిళలకు 182 పోస్టులు కేటాయించారు.

ఈ నియామకాల్లో టైలర్, కార్పెంటర్, ప్లంబర్, బార్బర్, వాషర్‌మన్, స్వీపర్, ఎలక్ట్రిషియన్, కుక్, మాలి, పెయింటర్, డ్రాఫ్ట్స్‌మన్ వంటి వివిధ ట్రేడ్స్‌లో పోస్టులు ఉన్నాయి.

notification-for-3-588-constable-posts-in-border-security-force

పోస్టుల వివరాలు..

కనీస విద్యార్హత..

10వ తరగతి (SSC/Matriculation) పాస్ కావాలి.

సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.

వయస్సు..

18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు.

SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు.

దివ్యాంగులకు 10 సంవత్సరాలు.

దరఖాస్తు ప్రక్రియ..

ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. జూలై 26, 2025 నుండి ఆగస్టు 24, 2025 వరకు BSF అధికారిక వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వేతనం..

ఎంపికైన అభ్యర్థులకు రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు వేతనం ఉంటుంది. అదనంగా, ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే పింఛన్, వైద్య సదుపాయాలు, గ్రేచ్యుటీ, హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రావెల్ అలవెన్స్ (TA) వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి.

ఎంపిక విధానం..

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) & ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)

ట్రేడ్ టెస్ట్ (సంబంధిత ట్రేడ్‌లో నైపుణ్యాన్ని అంచనా వేస్తారు)

లిఖిత పరీక్ష (పరీక్షలో సాధారణ జ్ఞానం, గణితం, రీజనింగ్, ప్రాథమిక ఆంగ్లం/హిందీ ప్రశ్నలు ఉంటాయి)

డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామ్

దరఖాస్తు ఫీజు..

సాధారణ (General) మరియు OBC అభ్యర్థులకు: రూ.100/-

SC/ST/మహిళా అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు.

ముఖ్య సూచనలు..

దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ను చదవాలి.

అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటోలు, సంతకం స్కాన్ కాపీలను సిద్ధం చేసుకోవాలి.

ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ కోసం సిద్ధం కావాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+